Sunday, April 28, 2024
- Advertisement -

గోవాలో శ్రీముఖి అందాల ఆర‌బోత.. మాములుగా లేదు..!

- Advertisement -

బుల్లితెర‌పై త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న న‌టి శ్రీ‌ముఖి. ఎంత‌మంది యాంక‌ర్లు ఎంట్రీ ఇచ్చిన త‌నకంటూ సొంతం చేసుకున్న క్రేజ్‌తో బుల్లితెర‌పై తిరుగులేని యాంక‌ర్‌గా కొన‌సాగుతోంది. ఇక ఇటీవ‌ల ఆమె మా టీవీలో ప్రసార‌మైన బిగ్‌బాస్ షోతో మ‌రింత పాపులారిటీ సంపాదించుకుంది. శ్రీ‌ముఖి బుల్లితెర‌పైనే కాకుండా వెండితెర‌పైన కూడా మెరిసి త‌న‌కంటూ సొంత అభిమాన శ్రేణుల‌ను సంపాదించుకుంది.

ఇదివ‌ర‌కు జులాయి, నేను శైలజ, జెంటిల్‌మన్, బాబు బాగా బిజీ వంటి చిత్రాల్లో నటిగానూ మెప్పించిన శ్రీ‌ముఖి ప్ర‌స్తుతం ప‌లు టీవీ షోల‌తో పాటు సినిమాలు సైతం చేస్తోంది. ఇక ఇప్ప‌టివ‌ర‌కు బిజీబిజీగా గ‌డిపిన ఆమె ప్ర‌స్తుతం త‌న మిత్రుల‌తో క‌లిపి గోవా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి సేద‌తీరుతున్నారు. అయితే, ఎప్పుడు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీ‌ముఖి.. తాజాగా గోవా ట్రిప్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు.

సోహెల్ నటించిన సినిమాలు, సీరియల్స్ ఇవే..!

ఆ ఫొటోలు ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఎందుకంటే త‌డిసిన త‌న హాట్ హాట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తి పోగొడుతోంది. ఇలాంటి రోజులు మ‌ళ్లీ రావు అంటూ ఫొటోల‌ను షేర్ చేసింది. అలాగే, ఆమె ఫొటోలు తీసిన ఆర్జే చైతూను బెస్ట్ ఫొటో గ్రాఫ‌ర్ అంటూ కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది. వీరితో పాటు మ‌రో యాంక‌ర్ విష్ణు ప్రియ కూడా ఉంది. గోవాలో వీరి ర‌చ్చ మాములుగా లేదుగా అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

విజ‌య్‌తో రోమాన్స్ చేసేదెవ‌రో ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -