Friday, April 26, 2024
- Advertisement -

విజ‌య్‌తో రోమాన్స్ చేసేదెవ‌రో ?

- Advertisement -

ఇటీవ‌లే మాస్ట‌ర్ అంటూ వెండితెర‌పై మెరుపులు మెరిపించి.. బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాస్తున్న త‌మిళ న‌టుడు ఇలయ ధళపతి విజ‌య్. ఆయ‌న న‌టించిన మాస్ట‌ర్ సినిమా ఇటీవ‌లే తెలుగు, త‌మిళ్ రెండు భాష‌ల్లోనూ విడుద‌లైన ఈ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఇదే ఊపులో ఇలయ దళపపతి మరో సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

విజయ్ 65వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం భారీ యాక్ష‌న్‌, రోమాంటిక్ మూవీగా తెర‌కెక్కుతోంద‌ని స‌మాచారం. అయితే, ఈ సినిమాలో విజ‌య్‌తో రోమాన్స్ చేయ‌బోయేది ఎవ‌ర‌నేదానిపై ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది. వారిలో ముగ్గురు ముద్దుగుమ్మ‌ల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో కియారా అద్వాణి, ర‌ష్మిక మంధ‌న‌, పూజా హెగ్దేలు ఉన్నారు. కాగా, ఈ చిత్రంలో హ‌ట్ బ్యూటీ న‌య‌న‌తార ఓ ముఖ్య‌పాత్ర‌లో న‌టిస్తోంది.

అయితే, ముగ్గురు అందాల తార‌ల‌లో విజ‌య్ ఎవ‌రితో రోమాన్స్ చేయ‌బోతున్నార‌నేది తెలియ‌లంటే కొద్ది కాలం వేచివుండాల్సిందే. కాగా, ఈ చిత్రానికి చిత్రసీమ రికార్డుల‌ను తిర‌గ‌రాసిన కేజీఎఫ్ స్టంట్ మాస్ట‌ర్స్ లు ఈ సినిమాకు యాక్ష‌న్ పార్ట్ ను కొరియోగ్రాఫ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. అనిరుధ్‌ రవిచంద్ర‌న్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై వ‌స్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపొందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -