Friday, May 17, 2024
- Advertisement -

హ‌మ్మ‌య్య‌..స్టార్ మ‌హిళ నుండి సుమ అవుట్‌

- Advertisement -

యాంక‌ర్ సుమ గ‌త కొన్నేళ్లుగా వ్యాఖ్య‌తగా వ్య‌వ‌హరిస్తున్న స్టార్ మహిళ ప్రొగ్రాంను ఆపేస్తున్న‌ట్లు యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది.తెలుగు టెలివిజన్ రంగంలో సుమ చేసినన్ని కార్యక్రమాలు మరే యాంకర్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. 12 ఏళ్ళుగా ‘స్టార్ మ‌హిళ’ అనే కార్య‌క్ర‌మాన్ని ఏ మాత్రం బోర్ అనిపించకుడా ఒంటి చేత్తో ముందుకు న‌డిపించిన సుమ ఇక ‘స్టార్ మహిళ’కు ఫుల్ స్టాప్ పెట్టనున్నారు. ఈటీవీలో మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కి ప్ర‌సార‌మ‌య్యే ఈ షోలో మహిళలతో ఆడించి, పాడించి, వారిలో ఉత్సాహాన్ని నింపి స్టార్ మహిళలుగా మనకు వినోదాన్ని అందించిన సుమ మూడు వేల‌కి పైగా ఎపిసోడ్స్‌ని పూర్తి చేసింది.

స్టార్ మహిళకు 12 ఏళ్ళుగా 3 వేల ఎపిసోడ్ లకు పైగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన సుమకు ఈ షో ద్వారా ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు కూడా దక్కింది.ఈ కార్యక్రమాన్ని ఆపనున్నట్టు చెప్పి, ‘ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’ అంటూ తనఫేస్ బుక్ బుక్ పేజ్ ద్వారా తెలిపారు.మరో సరికొత్త కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సుమ తెలిపారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -