Monday, May 20, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బ‌యోపిక్ : దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా ఎవ‌రు చేస్తున్నారో తెలిస్తే షాకే..!

- Advertisement -

తెలుగు జాతి ఖ్యాతిని ప్ర‌పంచ వ్యాప్తంగా చెప్పుకునేలా చేసిన వ్య‌క్తి నంద‌మూరి తార‌క రామారావు.ఇప్పుడు ఆయ‌న జీవిత క‌థ‌ను ఎన్టీఆర్ పేరుతో సినిమాగా తెర‌కెక్కిస్తున్నా సంగ‌తి తెలిసిందే.ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ చాలా వ‌ర‌కు పూర్తి అయింది, ఈ బ‌యోపిక్‌ను ఎన్టీఆర్ త‌న‌యుడు హీరో బాల‌కృష్ణే న‌టిస్తు,స్వ‌యంగా నిర్మిస్తున్నారు.క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో ఇప్ప‌టికే స్టార్స్ తీసుకుని సినిమాపై అంచ‌నాలు పేంచేశారు.ఈ సినిమాలో విద్యాబాలన్, రానా, రకుల్ ప్రీత్ సింగ్, సుమంత్ ,మోహ‌న్ బాబు,కాజ‌ల్ వంటి తారలు కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాలో కీల‌కమైన పాత్ర కోసం న‌టుడు భ‌ర‌త్‌ను తీసుకున్నార‌ని తెలుస్తుంది. ఇప్పుడు సినిమాలో ఎన్టీఆర్ అల్లుడి పాత్ర దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డిని ఫైనల్ చేశారు.

సినిమాలో ఎన్టీఆర్ ఇద్దరి అల్లుళ్ల పాత్రలను చూపించబోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు పాత్రను రానా పోషిస్తుండగా, దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రలో భరత్ రెడ్డి కనిపించనున్నాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో దగ్గుబాటి వెంకటేశ్వరావు కీలక పాత్ర పోషించాడు. అందుకే సినిమాలో ఆయన పాత్ర ప్రధానంగా సాగుతుందని సమాచారం.ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ అంద‌రిని ఆకట్టుకుంది.ఇక సినిమాను త్వ‌ర‌గా పూర్తి చేసి విడుద‌ల చేయ‌ల‌ని భావిస్తున్నాడు బాల‌కృష్ణ‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -