Wednesday, May 15, 2024
- Advertisement -

కేర‌ళ వ‌ర‌ద‌బాధితుల‌ కోసం క‌దిలిన క్రీడాలోకం…

- Advertisement -

గత పదిరోజుల నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాలతో కేరళ మొత్తం అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలకు తోడు తీవ్రమైన వరదలు రావడంతో జనజీవనం అస్తవ్యస్థమయింది. కేరళ వ్యాప్తంగా 13 జిల్లాల్లో ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. వరదల కారణంగా ఇప్పటివరకు 385 మంది దుర్మరణం చెందారు.

గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా వ‌ర‌ద‌లు రావ‌డంతో 80 డ్యామ్‌ల గేట్లు ఎత్తి నీటిని దిగువ‌కు వ‌దులుతున్నారు అధికారులు. 324 మంది ప్రాణాలు కోల్పోగా , 3లక్షల మందికి పైగా బాధితులు 1500కు పైగా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారని, తమ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు విరాళాలు అందించాలని కేరళ సీఎం పినరయి విజయ్ ట్వీట్ చేశారు.

కేర‌ళ‌సీఎం పిలుపుకు క్రికెట‌ర్లు స్పందించారు. కొందరు నేరుగా సాయం చేస్తే… మరి కొందరు కేరళ వాసులకు సాయం చేయాలని పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలో 23 ఏళ్ల భారత యువ క్రికెటర్‌ సంజు శాంసన్‌ రూ.15లక్షల ఆర్థిక సాయం ప్రకటించాడు. ఈ మేరకు అతని తండ్రి విశ్వనాథ్‌, సీఎం విజయన్‌ను కలిసి చెక్కు అందజేశారు.

దీనిపై ఓ ఇంటర్వ్యూలో శాంసన్‌ స్పందిస్తూ.. ‘పబ్లిసిటీ కోసం చేయలేదు. వరదల వల్ల నష్టపోయినవారికి సాయం అందుతుందని, నాలా ఇతరులు కూడా సాయం చేయడానికి ముందుకు వస్తారని ఇలా చేశాను. నాకు పబ్లిసిటీ అవసరేం లేదు. నేను చేసిన పని ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సహాయ నిధికి విరాళాలు ఇచ్చేదానిపై అవగాహన కల్సించాల్సిన అవసరం ఎంతో ఉంది. చాలా మంది వారికి తోచి సాయం చేస్తున్నారు.’ అని శాంసన్‌ చెప్పుకొచ్చాడు. గత సీజన్‌ ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.

మరోవైపు భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, హర్భజన్‌సింగ్, హార్దిక్ పాండ్యా, టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా, ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రి తదితరులు కేరళవాసులకు అభిమానులు మద్దతుగా నిలవాలని, తమవంతుగా సాయం చేయాలని పిలుపునిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -