Thursday, May 2, 2024
- Advertisement -

ఉద‌య‌భాను కంట‌త‌డి

- Advertisement -
  • బాల‌కృష్ణ‌ను ప్ర‌శంసిస్తూ భావోద్వేగం
  • బాల‌య్య‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం

బుల్లి తెర వ్యాఖ్యాత ఉద‌య‌భాను కంట‌త‌డి పెట్టారు. తాను హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఓ షోలో బాల‌కృష్ణ న‌టించిన ఓ సాంగ్ వ‌చ్చింది. ఆ పాట అనంత‌రం ఆమె బాల‌కృష్ణ‌ను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గుర‌య్యారు. ప‌రిశ్ర‌మ‌లో బాల‌కృష్ణ అంత మంచోళ్లు ఎవ‌రూ లేర‌ని చెప్పుకుంటూ వ‌చ్చింది. మా టీవీలో ప్రసార‌మ‌వుతున్న నీతోనే డ్యాన్స్ షోలో వ‌సూల్ వ‌సూల్ పాట‌కు డ్యాన్స్ అనంత‌రం ఆమె మాట్లాడారు.

నా జీవితంలో సంబ‌రాలు అనేవి లేవు. ఆడ‌పిల్ల‌ల‌కు కోరిక‌లుంటాయి. గ‌ర్భవ‌తి అయిన త‌ర్వాత ఇంకా కోరిక‌లు పెరుగుతాయి. శ్రీమంతం త‌దిత‌ర కార్య‌క్ర‌మాలు ఉంటాయి. అవ‌న్నీ నాకు జ‌ర‌గ‌లేదు. కొన్ని సంఘ‌ట‌న‌ల త‌ర్వాత దేవుడు లేడ‌ని భావించా. అవ‌న్నీ మూఢ న‌మ్మ‌కాలు అని కొట్టిపారేశా. అయితే నాకు ఇద్ద‌రు పిల్ల‌లు వ‌చ్చారు. పిల్ల‌లంటే నాకు చాలా ఇష్టం మాట‌ల్లో చెప్ప‌లేను. ఇద్ద‌రు పిల్ల‌లు మొద‌టి పుట్టిన రోజును వేడుక‌గా జ‌రుపుకోవాల‌ని నిర్ణ‌యించా. నా లైఫ్‌లో మొట్ట‌మొద‌టి పండుగ‌. అందుక‌ని సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన కొంత‌మందికి ఫోన్ చేసి పిలిచా. ఎవ‌రూ స్పందించ‌లేదు. కొంద‌రు ఫోన్లు కూడా ఎత్త‌లేదు. దీంతో చివ‌రికి బాల‌కృష్ణ‌కు చిన్న మెసేజ్ పెట్టా. సార్ నా ఇద్ద‌రిపిల్లల మొద‌టి పుట్టిన‌రోజు సార్‌.

మీరు రండి అని సందేశం పంపా. ఆ త‌ర్వాత అర్థగంట‌కు బాల‌కృష్ణ ఫోన్ చేశారు. నాకు వేరే కార్య‌క్ర‌మం అనంత‌పురంలో ఉంది. మీ ఇంటికి వ‌చ్చి త‌ర్వాత రాత్రి ప్ర‌యాణం చేస్తాన‌ని చెప్పాడు. ఆ త‌ర్వాత వేడుక‌కు సాయంత్రం 7.30 గంట‌ల‌కు సింహాలాగా వ‌చ్చాడు. ఆ స‌మ‌యంలో నిజంగంటే దేవుడులాగా క‌నిపించాడు. 5 నిమిషాలు కాదు దాదాపు 45 నిమిషాలు ఉన్నాడు. అంద‌రితో ఫొటోలు దిగాడు. హాట్సాఫ్ బాల‌య్య‌.. హాట్సాఫ్ బాల‌య్య‌.. హాట్సాఫ్ బాల‌య్య‌` అని తెలిపింది. ఆ విధంగా బాల‌కృష్ణ‌పై ప్ర‌శంస‌లు కురిపించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -