Sunday, April 28, 2024
- Advertisement -

కోహ్లీ సెంచ‌రీ ..ఇన్నీంగ్స్‌ను డిక్ల‌ర్ చేసిన ఇండియా..లంక విజ‌య ల‌క్ష్యం 231 ప‌రుగులు…

- Advertisement -

ఈడెన్ గార్డెన్‌లో శ్రీలంకతో జ‌రుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 172 పరుగులకే ఆలౌట్ అయిన భారత్ 122 పరుగులు వెనుకబ‌డింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఓపెనర్లు ధావన్, రాహుల్ శుభారంభం ఇచ్చారు. అనంతరం కోహ్లీ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ క్రమంలో కోహ్లీ సెంచరీ పూర్తి చేసి భారత్ ను పటిష్ట స్థితికి చేర్చాడు. 97 పరుగుల వద్ద భారీ సిక్సర్ బాది కోహ్లీ సెంచరీ మార్క్ చేరుకున్నాడు. కోహ్లీ 103 పరుగులతో ఆడుతున్నాడు. ప్రస్తుతం బారత్ ఆధిక్యం 230 పరుగులు. భారత్ స్కోరు 352/8.

ఈ టెస్టులో లంక విజయం సాధించాలంటే 231 పరుగులు చేయాల్సి ఉంది. టీ విరామ సమయానికి మరో అరగంట సమయం ఉంది. ఆ తరువాత 105 నిముషాలు ఆట సాగే అవకాశం ఉంది. కోహ్లీ ఇన్నింగ్స్ డిక్లెర్ చేయడం ద్వారా శ్రీలంక ఎదుట చాలెంజింగ్ టార్గెట్ ఉంచాడు. దీంతో మ్యాచ్ రసకందాయంలో పడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -