Tuesday, May 21, 2024
- Advertisement -

దేత్తడి ఏందీ గొల..!

- Advertisement -

బిగ్‌బాస్ ఫేమ్ దేత్త‌డి హారికకు కోపం వ‌చ్చింది. తెలంగాణ టూరిజం బ్రాండ్ అండాసిడ‌ర్ ప‌ద‌వికి గుడ్‌బై చెప్పింది. ఇదిలా ఉంటే.. ఆమె నియామకంపై తెలంగాణ ఎక్సైజ్‌, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఘాటుగా స్పందించారు. హారిక నియామకం పట్ల సీఎంవోకు గానీ, ఉన్నతాధికారులకు గానీ ఎలాంటి సమాచారం లేదన్నారు. అసలు హారిక ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు.

ప్రస్తుతం తాను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని, తొందరలోనే దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. దీని వెనుక ఎవరున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  ఈ నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ (టీఎస్‌టీడీసీ) బ్రాండ్ అంబాసిడ‌ర్‌ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్ర‌క‌టించి హారిక హూందాత‌నాన్ని చాటుకుంది.

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం రోజు నియ‌మ‌తులైన హారిక …మూడో రోజే బ్రాండ్ అంబాసిడ‌ర్ ప‌ద‌వి నుంచి వైదొల‌గ‌డం గ‌మ‌నార్హం. హారిక తాను త‌ప్పుకున్న విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు.  ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన‌ వీడియోలో ఆమె ఏమ‌న్నారో తెలుసుకుందాం. హారిక నియామ‌కంతో టూరిజంశాఖ‌లో నెల‌కున్న విభేదాల‌ను బ‌య‌ట‌పెట్టాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -