Friday, May 17, 2024
- Advertisement -

స‌మ్మ‌ర్ కదా.. కూల్ డ్రింక్స్ తాగితే ఏమవుతుందో తెలుసా?

- Advertisement -

వేస‌వికాలం వచ్చిందంటే చాలు.. ఎంతనీరు తాగినా దాహం ఓ పట్టాన తీరదు. చల చల్లగా తాగాలని నోరు ఉవ్విళ్లురుతుంటుంది. అందుకే చాలా మంది మంచి నీళ్లకు బదులుగా కూల్ డ్రిక్స్ ను లాగించేస్తుంటారు. ఎంత మోతాదులో తీసుకోవాలనే ఆలోచనే లేకుండా ఎడా పెడా తాగేస్తుంటారు. కొందరు వేసవికి మాత్రమే కూల్ డ్రింక్స్ ను తాగితే.. మరికొందరైతే.. కాలాలతో సంబంధం లేకుండా లాగించేస్తుంటారు.

మరి మన ఆరోగ్యానికి కూల్ డ్రిక్స్ మంచివా? కావా? అనే విషయాలన్ని చాలా మంది పట్టించుకోరు. నిజానికి ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే.. అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీటి వల్ల బరువు తొందరగా పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. కూల్ డ్రిక్స్ లో ఉండే చక్కెర మన శరీరంలో కొవ్వును పెంచేస్తుంది.

దీంతో బరువు పెరగడంతో పాటుగా గుండె జబ్బులు, డయాబెటిస్ సమస్యలు రావొచ్చు. ఈ సమస్యలకు దూరంగా ఉండాలనుకుంటే మాత్రం కూల్ డ్రింక్స్ కు బదులుగా కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ రసం, చెరుకు రసం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా బరువు పెరగకూడదు అనుకునే వారు ఈ కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండటం మంచిది.

బిగ్ బాస్-5లో స్టార్ సింగర్ హేమచంద్ర !

క్రేజీ ఫాదర్ అండ్ డాటర్ !

ఈ అమ్మడు కూడా పవన్ కు నో చెప్పిందా?

భారీగా రేటు పెంచిన బుట్టబొమ్మ !

అయ్యయ్యో.. పవన్ సినిమాకు కూడా లీకుల దెబ్బ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -