Sunday, April 28, 2024
- Advertisement -

ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా? అయితే మీలో !

- Advertisement -

ఇటీవ‌లి కాలంలో కొద్ది మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. తమ మెనూలో ఖచ్చితంగా మాంసాహారం ఉండేలా చూసుకుంటారు. ఒకరకంగా చెప్పాలంటే మాంసం లేనిదే.. ముద్దను తినలేకపోతుంటారు. అలాంటి వారికోసమే ఈ ఆర్టికల్. ప్రతి రోజూ మాంసం తీసుకునే వారికో బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఆక్స్ ఫ‌ర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నాన్ వేజ్ తినే వారికి సంబంధించి ప‌లు భయంకరమైన విష‌యాల‌ను వెల్ల‌డించారు.

మాంసాహారాన్ని వారానికి మూడు లేదా అంతకంటే ఎక్కవ సార్లు తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్ల‌డించారు. మాంసాహారంలో విటమిన్ ఎ, విటమిన్ బి, ప్రోటీన్లు, విటమిన్ డి, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నా.. రోజూ తీసుకుంటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చ‌రించారు.

మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, న్యుమోనియా వంటి తొమ్మిది రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎర్ర మాంసం లేదా ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకోవడం ప్రమాదకరమని చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల పేగు క్యాన్సర్ వస్తుందని నిపుణులు కనుగొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ అంశాన్ని తాజాగా వెల్ల‌డించింది. ఏనిమిది ఏండ్ల పాటు ఐదు మిలియన్ల మందిపై చేసిన పరిశోధన చేసి ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు.

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో హృతిక్ రోష‌న్ ఫైట్ !

బిగ్ బాస్-5లో స్టార్ సింగర్ హేమచంద్ర !

క్రేజీ ఫాదర్ అండ్ డాటర్ !

ఈ అమ్మడు కూడా పవన్ కు నో చెప్పిందా?

భారీగా రేటు పెంచిన బుట్టబొమ్మ !

అయ్యయ్యో.. పవన్ సినిమాకు కూడా లీకుల దెబ్బ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -