Thursday, May 2, 2024
- Advertisement -

స్టార్ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తున్న బాల‌య్య

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ హీరో బాల‌కృష్ణ రూటే స‌పరూటు.కెరీర్ ఆరంభం నుంచి ఆయ‌న క‌థ న‌చ్చితే చాలు ద‌ర్శ‌కుడు ఎవ‌రు? కొత్త‌నా పాతనా అని అస‌లు ఆలోచించ‌డు.తాజాగా ఆయ‌న మ‌రో నూత‌న కాంబినేష‌న్‌కు తెర‌లేపాడు.వ‌రుస హిట్ల‌తో మంచి జోష్‌లో ఉన్న అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ ఓ సినిమా చేయనున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.ప‌టాస్‌,సుప్రీమ్‌,రాజా ది గ్రేట్ సినిమాల‌తో హాట్రిక్ హిట్లు కొట్టిన అనిల్ ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్‌,విక్ట‌రీ వెంక‌టేశ్‌ల‌తో ఓ మల్టీస్టార‌ర్ మూవీని తెర‌కెక్కిస్తున్నాడు.

ఈ సినిమా పూర్తి అవ్వగానే బాల‌య్య‌తో సినిమా ఉంటుంద‌ని స‌మాచారం.అనిల్ రావిపూడి గ‌తంలో బాల‌య్య‌తో సినిమా ప్లాన్ చేశాడు.కాని అది ఎందుక‌నో వ‌ర్క్ అవుట్ కాలేదు.ఇప్పుడు తాజాగా అనిల్ రావిపూడి ఒక కథ రెడీ చేశాడని.. బాలయ్యకు వినిపించేందుకు రెడీ ఆవుతున్నాడని టాక్. బాలయ్య ఇమేజ్ కు సూట్ అయ్యేలా – హీరోయిజం పీక్స్ లో ఉండేలా కథ.. సీన్స్ పై అనిల్ కసరత్తు చేయడం జరిగిందట. ఈ కథను బాలయ్య ఒకే చేస్తే వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -