Sunday, May 26, 2024
- Advertisement -

దొంగిలించిన నిజాం వ‌స్తువుల‌ను రిక‌వ‌రీ చేసినపోలీసులు..

- Advertisement -

హైదరాబాదులోని పురానా హవేలీలో ఉన్న నిజాం మ్యూజియంలో ఈ నెల 2వ తేదీన చోరీ జరిగిన సంగతి తెలిసిందే. కోట్ల విలువైన టిఫిన్ బాక్స్, వజ్రాలు, కెంపులు పొదిగిన కప్పు, సాసర్, స్పూన్ లను ఇద్దరు దొంగలు చోరీ చేసి సంచ‌ల‌నం సృష్టించారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు 15 ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేశారు.

ఎట్ట‌కేల‌కు దొంగ‌త‌నం చేసిన నిందుతుల‌ను అరెస్ట్ చేసి వ‌స్తువుల‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని దొంగిలించిన తర్వాత దొంగలిద్దరూ ముంబై వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో బస చేశారు. కోట్ల విలువైన టిఫిన్ బాక్స్ ను ఓ దొంగ ప్రతి రోజు తిండి తినడానికి ఉపయోగించాడు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. చో

దొంగ‌త‌నానికి పాల్ప‌డిన మహ్మద్ గౌస్ పాషా అలియాస్ ఖూనీ గౌస్, మహ్మద్ మోబీన్‌ని అరెస్టు చేసి చోరీకి గురైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నిందితులు వివిధ రకాలు ఎత్తులు వేసినప్పటికీ వాటిని చిత్తు చేసి ఈ భారీ కేసును ఛేదించిన బృందాలను హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ అభినందించారు.

నిందితుల్లో ఒకరైన పాషా గతంలో దాదాపు 25చోరీ కేసుల్లో నిందితుడు కాగా.. మోబీన్ కొంతకాలం గల్ఫ్‌లో పనిచేసి ఓ కేసులో కొంత కాలం జైలు శిక్ష అనుభవించాడు. చిన్ననాటి నుంచి స్నేహితులు, దూరపు బంధువులు అయిన ఈ ఇద్దరు యువకులు పక్కా ప్రణాళికతో 40రోజుల ముందే రెక్కీ నిర్వహించి అత్యంత పకడ్బందీగా చోరీకి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -