అజ్ఞాతవాసి కోసం ఓ స్పెషల్ సాంగ్
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ కోసం తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ పవన్ కోసం పరితపిస్తున్నాడు. తెలుగులో వచ్చిన మొదటి అవకాశం పవన్ కల్యాణ్ సినిమా కావడంతో ఉబ్బితబ్బిబవుతున్నాడు. ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఈ సినిమాలోని రెండు పాటలను విడుదల చేశాడు. ఈ పాటలకు చక్కటి స్పందన వస్తోంది. బయటకెళ్లి చూస్తే.. గాలివాలుగా అని రెండు పాటు విడుదల చేశాడు.
ఇప్పుడు పవన్ కోసం ప్రత్యేకంగా అనిరుధ్ గాలివాలుగా పాట పాడుతూ తను డ్యాన్స్ చేశాడు. వెనకాల పవన్ కల్యాణ్ సినిమాలు కనిపిస్తూ పవన్‌పై ప్రత్యేక అభిమానం చాటుతూ వీడియో రూపొందించాడు. ఈ వీడియో సాంగ్‌ను ఆదిత్య మ్యూజిక్ విడుదల చేసింది. అనిరుధ్ పాట పాడుతూ డ్యాన్స్ చేస్తుంటే వెనకాల పవన్‌కల్యాణ్ సినిమాలు, కటౌట్లు కనిపిస్తుంటాయి. పవన్ కోసం ఈ వీడియో రూపొందించాడంట. పవన్‌కల్యాణ్ సినిమాలన్నీ గుర్తెచ్చేలా ఈ వీడియో సాంగ్‌లో ఉంది. మీరు కూడా చూడండి.పవన్ అజ్ఞాతవాసి సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో కీర్తి, సురేశ్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=WoFpP2JMARs
