Saturday, May 4, 2024
- Advertisement -

లీడ‌ర్ సినిమా మాదిరి భరత్ అనే నేను

- Advertisement -
  • రీషూటింగ్ ప‌నిలో కొర‌టాల‌

లీడ‌ర్ సినిమాగా మ‌హేశ్‌బాబు న‌టిస్తున్న `భ‌ర‌త్ అనే నేను` సినిమా ఉంద‌నే స‌మాచారంతో చిత్ర‌బృందం పునరాలోచ‌న‌లో ప‌డిందంట‌. శేఖ‌ర్‌క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ద‌గ్గుబాటి రానా న‌టించిన తొలి సినిమా `లీడ‌ర్‌`. భ‌ర‌త్ అనే నేను సినిమా పూర్త‌య్యే ద‌శ‌లో ఉంది. అయితే ఈ సినిమా గురించి ఒక్క‌సారి చూసుకుంటే లీడ‌ర్ సినిమా మాదిరి ఉంద‌ని తెలిసిందంట‌.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘భరత్ అనే నేను` షూటింగ్‌లో ఉంది. ఇటీవ‌ల హైదరాబాద్‌లో అసెంబ్లీ సెట్ వేసి కొన్ని ముఖ్య సన్నివేశాలను తీశారు. అయితే ఇప్పుడు ఆ సీన్ల‌ను మార్చి చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాడట దర్శకుడు కొరటాల శివ. ‘లీడర్’ సినిమా సీన్ల మాదిరి ఆ స‌న్నివేశాలు ఉన్నాయని తెలియ‌డంతో మ‌ళ్లీ రీషూట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. ఈ సినిమాలో హీరో ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడు. తండ్రి వారసత్వ రాజకీయాన్ని కొనసాగించే పాత్రలో కనిపించే మాదిరి ఉన్న‌ది.రీషూట్‌తో ఈ సినిమా ఆల‌స్య‌మ‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. దేవీశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు.

https://www.youtube.com/watch?v=gxhOHvtVc90

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -