Thursday, April 25, 2024
- Advertisement -

పట్టుబట్టి ఆ డైరెక్టర్ ను మార్పించిన సమంత

- Advertisement -

హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, హీరోయిన్ సమంత కాంబినేషన్ లో త్వరలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. నిన్ను కోరి, మజిలీ సినిమాలకు దర్శకత్వం వయించిన శివ నిర్వాణ ..ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ, సమంతతో రొమాంటిక్ లవ్ స్టోరీని ప్లాన్ చేసిన శివ నిర్వాణ మలయాళం కంపోజర్ గోపీసుందర్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు.

గోపి సుందర్ గీతగోవిందం సినిమాకు బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ అందించారు. దాంతో ఆయన పేరును విజయ్ దేవరకొండ .. దర్శకుడు శివకు సూచించడం దానికి ఆయన ఓకే చెప్పడం కూడా జరిగిపోయాయి. నిన్ను కోరి, టక్ జగదీష్ చిత్రాలకు గోపీసుందర్తో పనిచేయడంతో శివ నిర్వాణ కూడా ఆయన వైపే మొగ్గు చూపారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. హీరోయిన్ సమంత ఎంట్రీతో మొత్తం మారిపోయింది.

సమంత వచ్చి పట్టుబట్టి మరీ మ్యూజిక్ డైరెక్టర్ను మర్చేలా చేసిందన్న టాక్ నడుస్తోంది. తాను నటించిన కత్తి, ఓ బేబి సినిమాలకు మ్యూజిక్ అందించిన అనిరుధ్ రవిచందర్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని సూచించిందట. సామ్ ఒత్తిడి మేరకు అనిరుధ్ను ఫైనల్ చేసినట్టు సమాచారం. క్రియేటివ్ విషయాల్లో సమంత జోక్యం చేసుకోవడం ఎలాంటి ఫలితాలను ఇస్తుందన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ ఫలితాలు బాగుంటే మంచిదే..లేదంటే సామ్ కు విమర్శలు తప్పవని పలువురు చర్చించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -