Friday, April 26, 2024
- Advertisement -

కొడితే సాంగ్ తో అదరగొడుతున్న మిల్కీ బ్యూటీ

- Advertisement -

మెగా హీరో వరుణ్ తేజ్ తాజా చిత్రం గని. ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ తో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది నటి తమన్నా. నటిగానే కాక మంచి డాన్సర్ కూడా అయిన తమన్నా.. ఓ ప్రత్యేక గీతంలో నర్తిస్తుండటం ఆసక్తి రేపుతోంది. ‘కొడితే’ అంటూ సాగే ఈ పాట సాగనుంది. ఈ సాంగ్ కు సంబంధించి ప్రొమోను విడుదల చేయడంతో అది పుల్ స్వింగ్ తో వైరల్ అవుతోంది.

ఇందులో తమన్నా డాన్స్ అదుర్స్ అన్న కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ప్రోమోతోనే ఓ రేంజ్ లో పాపులర్ అవ్వడం విశేషం. ఈ మిల్కీ బ్యూటీ అందచందాలు, డ్యాన్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటన్నాయి. వరుణ్తేజ్కు జంటగా సాయ మంజ్రేకర్ నటిస్తోంది. ఈ చిత్రానికి కిరణ్ కొరపాటి దర్శకత్వం వహిస్తుండగా.. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఏప్రిల్ 8న ఈ సినిమా విడుదల కానుంది. అయితే సాంగ్ ప్రోమోతో పాటు తమన్నా ఓ రీల్ చేసి తోటి నటీనటులుకు, అభిమానులు ‘కొడితే’ డాన్స్ సవాల్ విసిరారు. దీనికి కూడా మంచి స్పందన వస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -