Sunday, May 12, 2024
- Advertisement -

హోట‌ల్ పెట్టేసిన ‘అజ్ఞాత‌వాసి’ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌

- Advertisement -

త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కుర్ర సంగీత ద‌ర్శ‌కుడు తెలుగులో తొలి సినిమాతోనే ఎదురుదెబ్బ తిన్నాడు. ఈ నేప‌థ్యంలో తెలుగ సినీ ప‌రిశ్ర‌మ నుంచి ప్ర‌స్తుతం ఒక్క పిలుపు కూడా రావ‌డం లేదు. అత‌డెవ‌రో కాదు ‘అజ్ఞాత‌వాసి’కి సంగీతం అందించిన అనిరుధ్ ర‌విచంద‌ర్‌. తెలుగులో పెద్ద‌ సినిమాకు అవ‌కాశం రావ‌డంతో సంబ‌ర‌ప‌డి క‌ష్ట‌ప‌డి సినిమాకు ప‌నిచేయ‌గా ‘అజ్ఞాత‌వాసి’ సినిమా అట్ట‌ర్ ఫ్లాప‌వ‌డంతో ఎంట్రీనే నిరాశ‌ప‌రిచింది. దీంతో నిరాశ‌తో ఓ వ్యాపారంలోకి దిగాడు.

‘అజ్ఞాత‌వాసి’తో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా స్థిర‌ప‌డాల‌నుకున్న అనిరుధ్‌కు సినిమా ఎదురుదెబ్బ త‌గ‌ల‌డంతో అనిరుధ్ నిరాశ‌ప‌డ్డాడు. కోలీవుడ్ యంగెస్ట్ టాలెంట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఉన్న అనిరుధ్ త‌మ భ‌విష్య‌త్‌పై ఆలోచ‌న‌లు పెట్టుకున్నాడు. సినిమాను న‌మ్ముకుంటే కాదు స్థిరంగా ఓ వ్యాపారంలోకి దిగాల‌ని భావించాడు. సినిమాలతో పాటు వ్యాపారం మొద‌లు పెట్టాడు. కొత్తగా రెస్టారెంట్ బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు.‘సమ్మర్ హౌజ్ ఈటరీ’ పేరుతో చెన్నైలో తన కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. దీంతో సినిమాలు లేని స‌మ‌యంలో రెస్టారెంట్ బిజినెస్ చూసుకునే అవ‌కాశం ఉంది. 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -