విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు భార్యగా అత్తారింటికి దారేది ఫేమ్ నదియా నటిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ‘ఎన్టీఆర్’ అనే సినిమాను తెరకెక్కుస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. తేజ దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలి భార్య బసవతారకం పాత్రలో నదియా మెరవనున్నట్లు సమాచారం.
ఈ సినిమా కోసం నదియాను దర్శక, నిర్మాతలు సంప్రదించరాంట. ప్రస్తుతం హిందీలో భారత తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్ర కోసం ఆమెను అనుకుంటున్న సమయంలో ఈ సినిమా ముచ్చట కూడా నదియా వద్దకు వెళ్లింది. నదియా ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయగలరని టీం భావించిందట. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్ని బాలయ్య స్వయంగా చేపట్టారు. ఈ ఏడాది చివరలో ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్. ఇప్టపికే జనవరి 18వ తేదీన సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. త్వరలోనే నటీనటుల ఎంపిక చేపట్టి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.
