Thursday, May 16, 2024
- Advertisement -

స‌ఫారీల‌కు మ‌రో ఎదురుదెబ్బ‌….గాయం కార‌నంగా వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌కు దూరం అయిన స్టార్ ఆట‌గాడు

- Advertisement -

దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టుకు కాలం క‌ల‌సి రావ‌ట్లేదు. ఇప్ప‌టికే ఆజ‌ట్టు కెప్టెన్ డూప్లెసిస్‌, స్టార్ ఆట‌గాడు డీవిల్ల‌ర్స్ దూరం అయ్యారు. కెప్టెన్ వేలి గాయం కార‌నంగా సిరీస్‌కు దూరం అయ్యాడు. రెండు వ‌న్డేల్లో ఓడిన స‌ఫారీజ‌ట్టుకు మ‌రో సారి కోలుకోలేని దెబ్బ త‌గిలింది. బ్యాట్స్‌మేన్‌, కీప‌ర్ డీకాక్ వ‌న్డే, టీ20 సిరీస్ నుంచి త‌ప్పుకున్నాడు.

భారత్‌తో ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే స్టార్‌ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్‌, డు ప్లెసిస్‌లు గాయాల బారిన పడగా, తాజాగా మరో కీలక ఆటగాడు క్వింటాన్‌ డీకాక్‌కు కూడా గాయం కారణంగా సిరీస్‌ నుంచి వైదొలిగాడు. మణికట్టు గాయం కారణంగా మొత్తం భారత్‌తో సిరీస్‌ నుంచి డీకాక్‌ తప్పకున్నాడు. సెంచూరియన్‌లో జరిగిన రెండో వన్డేలో భారత పేసర్‌ బూమ్రా వేసిన షార్ట్‌ పిచ్‌ బంతి డీకాక్‌ చేతికి బలంగా తాకింది. ఆ నొప్పి తీవ్రం కావడంతో డీకాక్‌ అర్థాంతరంగా భారత్‌తో సిరీస్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

మిగిలిన నాలుగు వన్డేలతో పాటు మూడు ట్వంటీ 20ల సిరీస్‌కు డీకాక్‌ దూరం కానున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. డీకాక్‌ తిరిగి కోలుకోవడానికి రెండు వారాల నుంచి నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉంది.అయితే అతని స్థానంలో మరొక ఆటగాడ్ని ఇంకా ఎంపిక చేయలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -