హీరోయిన్ అంజలి తెర మీద కనిపించి చాలాకాలం అయింది. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి అభిమానుల అలరించిన అంజలి కొంత గ్యాప్ తీసుకుంది. తెలుగు , తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి. ఆమె గతంలో గీతాంజలి – చిత్రాంగద లాంటి హారర్ చిత్రాల్లో నటించి హిట్లు కొట్టింది. తనకు కలిసి వచ్చిన హారర్ కథనే మరోసారి నమ్ముకుంది అంజలి. ఆమె తాజాగా నటించిన చిత్రం ‘లిసా’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ టీజర్ ఏమాత్రం ఆసక్తి రేకెత్తించలేకపోయింది.
అన్ని హారర్ సినిమాల మాదిరిగానే ఈ సినిమా ఉందని టీజర్‌ను చూస్తుంటే అర్థం అవుతోంది. రెగ్యులర్ హారర్ మూవీ కాన్సెప్టుతోనే ఇది కూడా రెడీ అవుతోందని అర్థమైంది. ఒక అడవిలో ఓ బూత్ బంగ్లా అందులో తిరిగే దెయ్యం చేసే విన్యాసాలు.. దానికి భయపడే మనుషులు ఇదంతా ఏమాత్రం కొత్తగా లేదు. పరమ రొటీన్ కథనే ఎంచుకుని 3డిలో తీస్తున్నారని అర్థమవుతోంది. ఈ సినిమాకు రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. సామ్ జోన్స్, మకరంద్ దేశ్ పాండే,బ్రహ్మానందం ,యోగి బాబు,సలీమా ,మైమ్ గోపీ, సురేఖ వాణి , కళ్యాణి నటరాజన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
- Advertisement -
పాత రొట్ట కథతో వచ్చిన అంజలి ‘లిసా’ టీజర్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -