Saturday, April 27, 2024
- Advertisement -

ట్విట్టర్​ లో దుమ్ములేపుతున్న అంజలి..!

- Advertisement -

ఫొటో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అంజలికి మొదట్లో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత తమిళ చిత్రం షాపింగ్​ మాల్​ లో నటించింది. ఆ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా డబ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఆమెకు తమిళ్ లో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఒక దశలో అక్కడ ఆమె స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. తమిళ అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.

తమిళంలో ఆమె చేసిన జర్నీ ఆమె కెరీర్ లోనే మైలురాయి. ఆ సినిమా ఆమెకు మంచి నటిగా గుర్తింపు తెచ్చింది. ఆ సినిమా తెలుగులో డబ్ అయి సూపర్ సక్సెస్ అయ్యింది. వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో అంజలి సీతగా ఆకట్టుకుంది. ఈ మూవీ విజయం సాధించడంతో వరుసగా తెలుగులో ఛాన్స్ లు వచ్చాయి. బలుపు, గీతాంజలి, డిక్టేటర్​, మసాలా’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది అంజలి.అయితే ఇటీవల విడుదలైన నిశ్శబ్దం, వకీల్ సాబ్ లో అంజలి చేసిన పాత్రలకు మంచి పేరు తీసుకొచ్చింది.

Also Read: బ్లాక్ బస్టర్ సినిమాల దర్శకుడితో తారక్​ మూవీ..!

ఇదిలా ఉంటే ఆమె ట్విట్టర్​ ఫాలోవర్స్​ సంఖ్య 1 మిలియన్​ మార్కుకు చేరుకున్నది. ట్విట్టర్​లో సమంతకు 8.8 మిలియన్లు, శృతి హాసన్‌కు 7.8 మిలియన్లు, త్రిషకు 5.3 మిలియన్లు, తమన్నాకు 5 మిలియన్లు, హన్సికాకు 5 మిలియన్లు, కాజల్‌ అగర్వాల్‌కు 4.8 మిలియన్లు, కీర్తి సురేష్‌కు 3.9 మిలియన్లు, ఐశ్వర్యా రాజే‌ష్‌కు 2.1 మిలియన్లు, అమలాపాల్‌కు 2.1 మిలియన్లు, సాయి పల్లవికి 1.9 మిలియన్లు, రాయ్‌లక్ష్మికి 1.8 మిలియన్లు, రాశిఖన్నాకు 1.3 మిలియన్ల చొప్పున ఫాలోవర్స్​ ఉన్నారు. ప్రస్తుతం అంజలి కూడా 1 మిలియన్​ ఫాలోవర్స్​ సరసన చేరింది.

Also Read: రాశి ఖన్నా జెట్ స్పీడ్.. ఒకేసారి ఆరు సినిమాల్లో ఛాన్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -