- Advertisement -

నాగార్జున అంతలా ఎందుకు భయపడుతున్నాడు..

- Advertisement -

అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన అగ్ని ప్రమాదం వలన ఎవరికీ ఏమీ జరగకపోయినా…ఆ విషయాలు తెలుసుకుంటే తనకేదో జరిగిపోతుందని నాగార్జున గుబులు పడటం చూస్తుంటే… ఏదో జరిగిందనే విషయం భయటపడుతుంది. మనం సినిమా కోసం వేసిన ఆ సెట్ పూర్తిగా కాలిపోయింది. ఆ సినిమా ఎప్పుడో పూర్తయినా… నాన్నగారి కోసమని ఆయన మీద సెంటిమెంట్ తో ఇప్పటివరకు ఈ సెట్ ను ఉంచారు. ప్రస్తుతం అక్కడ చిన్న చిన్న సీరియళ్లు ,సినిమాలు షూటింగ్ లు జరుపుకుంటున్నాయి. ఫైర్ అయినవెంటనే మీడియా వచ్చి ఆ సంఘటనను కరవ్ చేయకబోతే స్వయంగా నాగ్ వచ్చి మీడియా బృందాలను చెల్లాచెదురు చేయడం చాలా అనుమానాలకు తావిస్తుంది.

అన్నపూర్ణ స్టూడియోస్ సెక్యూరిటీ బృందం మీడియా మిత్రులను బయటకు వెళ్లగొట్టగా…టీవి ౯,టివి 10తో పాటు కొందరు యూ ట్యూబ్ ఛానళ్ల ఓనర్లు ..మొబైల్ తో ఆ దృశ్యాలను కవర్ చేసే ప్రయత్నం చేశారు. చివరకు వారి మొబైల్స్ కూడా లాక్కుని ఆ ఫీడ్ ను డిలీట్ చేయడం జరిగింది. నా ప్రైవేట్ ప్రాపర్టీని మీరు షూట్ చేయెద్దంటూ వారిని నాగ్ వాదించాడు. గవర్నమెంట్ ఇచ్చిన ప్రోపర్టీ ప్రైవేట్ ప్రోపర్టీ ఎలా అవుతుందని కొందరు మీడియా పెద్దలు వాదిస్తున్నారు. ప్రభుత్వం నుంచి తీసుకున్న స్థలంలో స్టూడియో కట్టేసినంత మాత్రాన అది ఎలా ప్రవైట్ ప్రోపర్టీ అవుతుందో నాగ్ చెప్పాలి.ఇదంతా ఎందుకుగాని…స్టూడియోలో ఫైర్ ఇంజిన్ ఉందని చెబుతోన్న నాగార్జున…అంత తక్కువ వ్యవధిలో సెట్ ఎలా కాలిపోయిందో స్పష్టత ఇస్తే…. అనుమానాలు నివృతమౌతాయి కదా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -