Friday, May 17, 2024
- Advertisement -

తెలుగు వారి ఆత్మాభిమానం కోసం పుట్టిన పార్టీ క‌నుమ‌రుగేనా…..

- Advertisement -

తెలుగు దేశం పార్టీ తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని నిల‌బెట్ట‌డం కోసం పుట్టిన పార్టీ. ఉమ్మ‌డి ఏపీలో టీడీపీ తిరుగులేని పార్టీగా అవ‌త‌రించింది. ద‌శాబ్ధాల చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్‌ను మ‌ట్టి క‌రిపించి అధికారంలోకి వ‌చ్చి న పార్టీ. కాని రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణా రాష్ట్రంలో పార్టీ అష్టావ‌సాన ద‌శ‌లో ఉంది. పార్టీ భ‌విష్య‌త్తు గాల్లో దీపంలా వేలాడుతోంది. 40 సంవ‌త్స‌రాల రాజ‌కీయ‌ అనుభ‌వం ఉన్న పార్టీ అధినేత బాబుకూడా చేతులెత్తేశారు. ఇక తెలంగాణాలో నాయ‌కుడెవ‌రు అనే స‌మ‌స్య టీడీపీని ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఉన్న ఒక్క మాస్ నాయ‌కుడు రేవంత్ రెడ్డి పార్టీని వీడ‌టంతో దిక్కుతోచ‌ని స్థితిలో ఉంది.

తెలంగాణా రాస్ట్రంలో ఒక వెలుగు వెలిగిన టీడీపీ ఆరిపోయో దీపంలా క‌నిపిస్తోంది. ఉమ్మ‌డి రాష్ట్రంలో బ‌ల‌మైన నాయ‌కుల‌తో ప‌టిష్టంగా ఉన్న పార్టీ విభ‌జ‌న త‌ర్వాత ఆపార్టీ క‌ష్టాల్లో ప‌డింది. పార్టీలో ఉన్న బ‌ల‌మైన నాయ‌కులంద‌రూ కారెక్క‌డంతో మాస్ క‌లిగిన నాయ‌కులు ఎవ్వ‌రు లేరు. దానికి ప్ర‌ధానం కార‌నం చంద్ర‌బాబు రెండు క‌ళ్ల సిధ్ధాంతం అనుస‌రించ‌డంతో ప‌రిస్థితి దాపురించింది. మ‌రో వైపు టీడీపీని బాబు ప‌ట్టించుకోక‌పోవ‌డం ఇంకొటి.

2014 ఎన్నిక‌ల్లో భాజాపాతో పొత్తు పెట్టుకొని టీడీపీ ఓట‌మిపాల‌యిన సంగ‌తి తెలిసిందే. పార్టీత‌రుపును గెలిచిన మెజారిటీ ఎమ్మెల్యేలు కారెక్కేశారు. ఇక టీడీపీ బాధ్య‌త‌ల‌ను యువ‌నాయ‌కుడు లోకేష్‌కు అప్ప‌గించారు. గ‌తంలో జ‌రిగిన జీహెచ్ ఎంసీ ఎ్న‌నిక‌ల్లో భాజాపా-టీడీపీ కూట‌మి ఘోర‌ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. అప్ప‌టినుంచి పార్టీని ప‌ట్టించుకోవ‌డం మానేశారు చంద్ర‌బాబు. ప‌ది సంవ‌త్స‌రాలు ఉన్న ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ఉండి తెలంగాణాలో టీడీపీని బ‌ల‌ప‌ర్చాల‌ని చూసిన బాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని అమ‌రావ‌తికి పారిపోయారు. అప్ప‌టినుంచి తూతూ మంత్రంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్వ‌వేక్షిస్తున్నారు.

గ‌త కొంత‌కాలంగా తెలంగాణాలో పార్టీని బ‌లోపేతంపై దృష్టిసారించాల‌ని నాయ‌కులు మొత్తుకున్నా బాబు ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. బాబు,లోకేష్‌లు ఇద్ద‌రు పార్టీని వ‌దిలేశార‌నె చెప్పాలి. అయినా ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న రేవంత్ ఒక్క‌డే పార్టీకి పెద్ద‌దిక్కుగా ఇన్నాల్లు టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తూ పార్టీని న‌డిపిస్తున్నారు. పార్టీకి మాస్ పాలోయింగ్ ఉన్న నేత రేవంత్ ఒక్క‌రే. ఆయ‌న కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. బాబు మ‌డ‌త పేచీ రాజ‌కీయాల‌ను చూసి త‌ట్టుకోలేక భ‌విష్య‌త్ కోసం పార్టీమారార‌న‌డంలో సందేహంలేదు.

రేవంత్ పార్టీని వ‌దిలిపోతూ త‌న‌తో పాటు మ‌రికొంద‌రిని తీసుకు వెల్లారు. దాంతో తెలంగాణాలో ఉన్న జిల్లాల ప్ర‌సిడెంట్లు, ఇత‌ర నాయ‌కులు అధిక సంఖ్య‌లో కారెక్కారు. దీంతో పార్టీ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డింది. ఆపార్టీకి ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలు ఇప్ప‌టికె టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్ త‌ర్వాత మిగిలింది ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌ల్లో ఆర్‌ కృష్ణ‌య్య ఉన్నా ఒక‌టె లేకున్నా కొటే. మ‌రో ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌కూడా ఓటుకు నోటు కేసు ఉండ‌టంతో ఎప్పుడైనా కారెక్క‌డానికి సిద్ధంగా ఉన్నారు.

పార్టీలో ఉన్న నాయ‌కులంతా వేరేపార్టీలోకి వెల్తుంటె ఇక తెలంగాణాలో పార్టీకి సార‌ధిగా ఉండి ఎవ‌రు పార్టీనీ న‌డిపిస్తార‌నేది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఓటుకు నోటు కేసులో బాబు అడ్డంగా దొరికిపోవ‌డంతో ఏమి చేయ‌లేని ప‌రిస్థితి. ఇక చిన‌బాబు లోకేష్‌ను చూస్తె ఆయ‌న రాజ‌కీయ ప‌రిజ్ణానం అంద‌రికి తెలిసిందే. లోకేష్ వ‌ల్ల‌నె తెలంగాణాలో పార్టీ నాశ‌నం అయ్యింద‌నె వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నా తెలంగాణాలో మాత్రం వెంటిలేట‌ర్ మీద ఉంద‌న‌డంలో సందేహంలేదు. వ‌చ్చె ఎన్నిక‌ల నాటికి పార్టీ పూర్తిగా ఖాలీ అయినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రంలేదు. తెలుగు ఆత్మ‌గౌర‌వం నిల‌ప‌డంకోసం పుట్టిన టీడీపీ తెలంగాణాలో క‌నుమ‌రుగు అయ్యే దుస్థితిలో ఉంది.

ముంద‌స్తు ఎన్నిక‌లు రానున్నాయ‌నె వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికె ఆపార్టీని ఒక్కొక్క‌రు వీడి వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు. చంద్ర‌బాబు కూడా పార్టీ భ‌విష్య‌త్తుపై ఆశ‌లు వ‌దులుకున్న‌ట్లే తెలుస్తోంది. అధికార పార్టీతో పొత్తు పెట్టుకుంటుంద‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. అందులో నిజం లేదు. పార్టీ క‌నీసం బ్ర‌తికి బ‌ట్ట క‌ట్టాలంటె అధికార‌పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందే లేదంటె పార్టీ కార్య‌ల‌యాన్ని మూసుకోవాల్సిందే. భ‌విష్య‌త్తు ఎలు ఉంటుంద‌నేది చెప్ప‌లేం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -