Monday, May 6, 2024
- Advertisement -

రెడీ అవుతున్న జ‌గ‌ప‌తిబాబు బ‌యోపిక్

- Advertisement -

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ప్ర‌స్తుతం బ‌యోపిక్‌ల హ‌డావిడి న‌డుస్తుంది.ఇక ఇప్ప‌టికే ప‌లువ‌రి స్టార్స్ బ‌యోపిక్‌లు తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.తాజాగా తెలుగులో మ‌రో క్రేజీ బ‌యోపిక్ రంగం సిద్ధం అవుతుంది.హీరో జగపతిబాబు బ‌యోపిక్ రెడీ అవుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.జగపతి ఆర్ట్స్ అధినేత – దసరా బుల్లోడు నిర్మాత అయిన ది గ్రేట్ వి.బి.రాజేంద్ర ప్రసాద్ వారసుడిగా హీరో అయినా జగపతిబాబు అంత సులువుగా కెరీర్లో సెటిలైపోలేదు. ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కోని ఈ స్థాయికి చేరుకున్నాడు. జగ్గూ భాయ్ జీవితంలో వేరొక కోణం పరిశీలిస్తే పలువురు కథానాయికలతో ఎఫైర్లు – యాంకర్లతో ఎఫైర్లు అంటూ చాలానే వివాదాలున్నాయి.

జగపతిబాబుకు స్టార్ హీరోయిన్ ప్రియమణితో ఎఫైర్ ఉందన్న ప్రచారాన్ని వేరొక సీనియర్ యాంకర్ తో ఎఫైర్ అన్న మాటను.. అంత తేలిగ్గా మర్చిపోలేదు తెలుగు ఆడియెన్. ఒకవేళ బయోపిక్ తీస్తే ఈ వివాదాల్ని టచ్ చేస్తారా? లేదూ మహానటి సినిమాలో తరహాలో అసలేం లేదులే అనే తరహాలో లైట్ తీస్కుని కథలో అవేవీ లేకుండా తీసిపారేస్తారా? అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. జగపతిపై వెబ్ సిరీస్ తీసేందుకు రెడీ అవుతున్న వేళ ప్రత్యేకించి దీనిపై ఫిలింనగర్ జనం చెవులు కొరుక్కుంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -