Friday, May 24, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌ను ఆపేయండి

- Advertisement -

తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌పై మానవ హక్కుల కమిషన్‌లో ఓ ఫిర్యాదు దాఖలైంది.బిగ్‌బాస్‌ను ఆపేయాల‌ని కోరుతు హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్‌ ఫిర్యాదు చేశారు. ఓ టీవీ చానల్‌లో ప్రసారమవుతున్న బిగ్‌ బాస్‌ షోలో టాస్క్‌ల పేరుతో వెకిలి చేష్టలు చేస్తున్నారని,మహిళలను కించపరిచేలా ఈ షో ఉందని ఆయన ఆరోపించారు. బిగ్‌బాస్ ప్రోగ్రాం పేరుతో ఒకే ఇంటిలో 16 మందిని నిర్బంధించి సమాజానికి ఉపయోగపడని, అనవసరమైన వెకిలి చేష్టలను ప్రసారం చేస్తున్నారన్నారు.

ఈ షోతో ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తూ, కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నారని రాపోలు భాస్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.షోలో పాల్గొన్నవారిని బయటకు పోనివ్వకుండా ఒకే ఇంట్లో ఉంచడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు.చిలిపి టాస్కులు, సహజీవనం కాన్సెప్టుతో ఉన్న ప్రోగ్రాములు సమాజానికి నష్టం చేస్తాయని తెలిపారు.మ‌రి ఈ స‌మ‌స్య నుంచి బిగ్‌బాస్ ఎలా బ‌య‌ట‌ప‌డుతుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -