Monday, May 20, 2024
- Advertisement -

ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఎవ‌రు..? వైసీపీనా లేకా టీడీపీనా..?

- Advertisement -

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరందుకోగా.. ఏపీలోనూ ఎన్నికల వాతావారణం వేడెక్కింది. పార్టీలు ప్ర‌జామ‌ద్ద‌తు ఉన్న నాయ‌కుల‌ను పార్టీలోకి చేరిక‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేన దూకుండు పెంచింది. ఇత‌ర పార్టీనేత‌ల‌ను ఆహ్వానిస్తోంది.

తాజాగా 20 మంది ఎమ్మెల్యేలు జ‌న‌సేన‌లో చేర‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని పార్టీ క‌న్వీన‌ర్ పార్ధ‌సార‌ధి చెప్ప‌డంతో సంచ‌ల‌నంగా మారింది. అయితే ఏ పార్టీనుంచి వ‌స్తున్నారో మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. వారంతా ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో చర్చించారని, ఆయన నిర్ణయాన్ని తీసుకున్నా ఆ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు.

20 మంది ఎమ్మెల్యేలుఅయితే, తెలుగుదేశంపార్టీ లేక‌పోతే వైసిపికి మాత్ర‌మే ఎంఎల్ఏలున్నారు. కాబ‌ట్టి రెండు పార్టీల నుండి ఎంఎల్ఏలు వెళ్ళిపోవాలి. ఎంఎల్ఏలే కాకుండా ఇత‌ర పార్టీల్లోని చాలా మంది సీనియ‌ర్ నేత‌లు రెడీగా ఉన్నార‌ట జ‌న‌సేన‌లో చేర‌టానికి.

ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఎవ‌ర‌న్న‌దే చ‌ర్చ‌నీయాంశంగా మారింది. క‌న్వీన‌ర్ చెప్పింది కాసేపు నిజ‌మే అనుకున్నా ఆ 20 మంది ఎంఎల్ఏలు ఎవ‌రో చూద్దాం. పార్టీలో చేర‌బోయో చేర‌బోయే ఎంఎల్ఏల్లో ఎక్కువ మంది ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన వారే అయ్యుండాలి. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలంటే టీడీపీ ఎమ్మెల్యేలే ఎక్కువ‌గా ఉండాలి.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని 15 మంది ఎంఎల్ఏల్లో వైసిపికి ఒక్కళ్ళు కూడా లేరు. తూర్పు గోదావ‌రి జిల్లాలో 19 మంది ఎంఎల్ఏలున్నారు. పోయిన ఎన్నిక‌ల్లో గెలిచిన 6 మంది వైసిపి ఎంఎల్ఏల్లో ప్ర‌స్తుతం ముగ్గురు మాత్ర‌మే పార్టీలో ఉన్నారు. అంటే మిగిలిన 16 మంది టిడిపి ఎంఎల్ఏలే. మిగిలి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించ‌కుండా పార్టీలోనే ఉన్నారు. ఇపుడు జ‌న‌సేన‌లోకి వెళ్ళే అవ‌కాశాలు కూడా త‌క్కువనే అనుకోవాలి. ఎటు చూసినా టీడీపీకే దెబ్బ‌.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టికెట్లు ఇచ్చే అవ‌కాశం లేద‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌స్తున్నాయి. కాబ‌ట్టి టిక్కెట్టు రాద‌నే అనుమానం ఉన్న ఎంఎల్ఏల్లో ఎవ‌రైనా జ‌న‌సేన‌లో చేరేందుకు అవ‌కాశం ఉంది. ఎలా చెప్పుకున్నా ఆ20 మంది నేత‌లు ఎవ‌ర‌నేది ఇప్పుడు రాజ‌కీయ పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -