- రచయిత టీజర్ విడుదల
- మరో హర్రర్ నేపథ్య సినిమా
హర్రర్ సినిమాల పరంపర తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతోంది. ఈ కోవ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. చిన్న సినిమాలు కూడా పెద్ద సినిమాలుగా నిలుస్తూ విజయాల బాట పడుతున్నాయి. ఆ నేపథ్యంలోనే మరో సినిమా వస్తోంది. అదే రచయిత సినిమా. ప్రముఖ రచయిత చంద్రబోస్ అందించిన కథ ఆధారంగా రచయిత సినిమా వస్తోంది. ఈ సినిమాలో ఈద్యాసాగర్ రాజు, సంచితా పదుకొనే, శ్రీధర్ వర్మన్, వడ్లమణి శ్రీనివాస్, హిమజ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు విద్యాసాగర్ రాజు, కళ్యాణ్ ధూళిపాల నిర్మాత. దుహరా సినిమా ఆధ్వర్యంలో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదల అయ్యింది. తాజాగా ఈ సినిమా టీజర్ కూడా విడుదల అయ్యింది. జగపతిబాబు వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది.
‘‘1954వ సంవత్సరం ఒక ప్రశాంతమైన ప్రదేశంఓ అందమైన అమ్మాయి జీవితం కలలకి భయపడుతూ.. కల్పనకి కలవరపడుతూ.. కాలం చేసే గాయాల్ని భరిస్తూ..మున్ముందు రాబోయే మలుపేదో, ముగింపేదో తెలియని తన కథఒక నిర్జీవ ప్రవాహం..’’ అంటూ జగపతిబాబు వాయిస్ ఓవర్ చెబుతున్నాడు.తెలుగు తెరపైకి వినూత్న కథతో ఈ సినిమా రాబోతుందని తెలుస్తోంది. అయితే ఇటీవలనే జగపతి బాబు ఈ సినిమాకు మద్దతు తెలుపుతూ విజయవాడ, విశాఖపట్టణంలో హఠాత్తుగా యాత్రలు చేశాడు. చిన్న సినిమాలను ప్రోత్సహించాలని అందర్నీ కోరాడు.