Monday, May 6, 2024
- Advertisement -

వేటగాడు గెట‌ప్‌లో బాల‌య్య …!

- Advertisement -

నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌ను ఎన్టీఆర్ పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నారు. క్రిషం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్‌ త‌నయుడు హీరో బాల‌కృష్ణ న‌టిస్తు,నిర్మిస్తున్నారు.ఈ బయోపిక్ ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్య పలు గెటప్స్‌ని విడుదల చేసి సినిమా అంచ‌నాలు పెంచేశాడు ద‌ర్శ‌కుడు.తాజాగా సినిమాలోని మ‌రో గెట‌ప్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. ‘వేటగాడు’ సినిమాలో ఎన్టీఆర్ లుక్ లో బాలయ్యని రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ని వదిలింది చిత్రబృందం.

అచ్చం తన తండ్రిలానే ఆ గెటప్‌లో దర్శనమిచ్చాడు బాలయ్య. దివంగత ఎన్టీఆర్ కెరీర్‌లో ‘వేటగాడు’ సినిమా కీలకపాత్ర పోషించింది.అప్పట్లో ఈ సినిమా రికార్డులు సృష్టించింది. ఆ కారణంగానే ఈ బయోపిక్ లో వేటగాడు గెటప్ ని చూపించబోతున్నారు.ఇప్పటికే రకుల్, బాలయ్య కాంబినేషన్ లో ఆకుచాటు పిందె తడిసే పాటని చిత్రీకరించారు. అలానే సినిమాలో ‘వేటగాడు’కి సంబంధించి మరికొన్ని సీన్లు కూడా చిత్రీకరించబోతున్నారు.విద్యాబాల‌న్‌,ర‌కుల్‌,త‌మ‌న్నా,సుమంత్‌,రానా వంటి వారు సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -