Wednesday, May 22, 2024
- Advertisement -

శ్రీనువైట్లకు దెబ్బ మీద దెబ్బ… కోన కు కూడా నష్టం!.

- Advertisement -

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ శ్రీనువైట్లకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది.వరుస పెట్టి వస్తోన్న కష్టాలు చాలవన్నట్లు తాజాగా మరో ఎదురు దెబ్బ తగిలింది.అది కూడా తనతో విడిపోయినట్లే విడిపోయి….. మళ్లీ కలిసిపోయిన కోన వెంకట్ నుంచి. విషయంలోకి వస్తే…..శ్రీనువైట్ల తన కథను కూనీ చేసి తనకు తోచిన నట్లుగా మార్చేసి బ్రూస్ లీ చిత్రాన్ని తీసాడని అందుకే సినిమా పోయిందని కోన వెంకట్ ఆరోపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

శ్రీను వైట్ల చేసిన ఈ పని వలన బ్రూస్ లీ ఫ్లాప్ టాక్ తన మీద పడి తన ఇమేజ్ కు భంగం ఏర్పడిందని దీని వలన తన పరువు పోయిందని అందుకే శ్రీనువైట్ల తనకు నష్ట పరిహారం అందివ్వాలని అంటున్నాడట. ఇప్పటికే కోన ఈవిషయమై హై కోర్ట్ అడ్వకేట్ ను కలిసి కేసు ఎంత వరకు నిలబడుతుందనే విషయమై ఆరా తీసినట్లు ఓ ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ఓ ఆర్టికల్ ను కూడా ప్రచురించింది.

మేధావుల చెప్పిన దాని ప్రకారం ఒక వేల కోన కోర్టుకు పోయినా అతనికేమి ఒరగదని …ఎంతో తెలివిగా బ్రూస్ లీ ఎఫెక్ట్ తనపై పడకుండా  శ్రీనువైట్ల పైనే మొత్తం దోచేసే  ప్రయత్నం కోన చేస్తున్నాడని చెబుతున్నారు.

ఏది ఏమైనా శ్రీను వైట్లకు దెబ్బ మీద దెబ్బ తగలుతూ ఉండడంతో అతను మరింత నెర్వస్ అయిపోతున్నాడని చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -