Saturday, May 18, 2024
- Advertisement -

అడగొద్దని ముందే కండిషన్స్ పెట్టారా?

- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు… వెళ్లారు. ఢిల్లీ నుంచి మట్టి, యమున నీళ్లు తప్ప ఇంకేమీ తీసుకురాలేదు. కానీ.. 5 కోట్ల మంది విమర్శలను మాత్రం తనతో మోసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపనను తన చేతుల మీదుగా పూర్తి చేయించిన ప్రధాని మోడీ.. ప్రత్యేక హోదాపై మాట మాట్లాడకుండా పని కానిచ్చేశారు. అభివృద్ధికి అండగా నిలుస్తామంటూ మాటలు చెప్పి.. ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. ఈ తతంగమంతా జరగడానికి ముందు.. ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోడీ కొన్ని కండిషన్స్ పెట్టి ఉంటారంటూ… కొందరు కొత్త వాదన తెరపై తీసుకొస్తున్నారు. దీనికి ఆధారంగా… అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో మోడీ, చంద్రబాబుల వ్యవహారశైలిని ఉదాహరణగా చెబుతున్నారు.

ప్రసంగం ప్రారంభిస్తూనే.. తెలుగులో మాట్లాడి శ్రీశ్రీ కవిత కూడా చెబుతూ.. అందరినీ ఆకట్టుకునేందుకు ప్రధాని ప్రయత్నించారు. తాను సైతం అమరావతి నిర్మాణానికి మట్టి, నీరు తీసుకొచ్చానని చెప్పారు. చివరికి.. విభజన చట్టంలోని హామీలన్నీ తీరుస్తామన్న మాట తప్ప.. రాష్ట్రానికి సహాయంపై ఏదీ క్లారిటీగా చెప్పలేదు. అయితే.. ఏపీకి ప్రత్యేక హోదా విషయం.. విభజన చట్టం పరిధిలోది కాదన్న విషయం ప్రధానికి తెలియని విషయం కాదు.

గత ప్రభుత్వం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించిన సమయంలో.. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కల్పిస్తామని మాత్రమే చెప్పారు. అంతే కానీ.. విభజన చట్టంలో ఎక్కడా ఆ ప్రస్తావన లేకుండా యూపీయే ప్రభుత్వం విభజన పని పూర్తి చేసింది. ఇప్పుడు విభజన చట్టం మాట మళ్లీ మళ్లీ చెబుతున్న ప్రధాని మోడీ మాటల వెనక ఉద్దేశం కూడా అదేనని అంతా అనుకుంటున్నారు. అంతేకాక.. తనను ప్రత్యేక హోదా డిమాండ్ తో ఇబ్బంది పెట్టొద్దని చంద్రబాబుకు మోడీ ముందే కండిషన్ పెట్టి ఉంటారని కొందరు అనుమానిస్తున్నారు. సభలో.. ఇద్దరూ ఈ విషయంపై మాట్లాడకపోవడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు.

అయితే.. ప్రత్యేక హోదా విషయంలో రాద్ధాంతం ఎందుకని టీడీపీ నేతలంటున్నారు. స్పెషల్ స్టేటస్ తో వచ్చే ప్రయోజనాల కంటే ఎక్కువగానే కేంద్రం ఇస్తోందని చెబుతున్నారు. రాష్ట్రానికి ఉన్నత విద్యా సంస్థల కేటాయింపు నుంచి.. కేంద్రం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకంలో దాదాపుగా ఏపీ పేరు చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఈ వాదనల మధ్య.. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం కాస్తా.. రాజకీయ విమర్శలకు పనికొస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -