Saturday, May 18, 2024
- Advertisement -

టాలీవుడ్ ను పంచేసుకున్నారు!!

- Advertisement -

టాలీవుడ్ ను బడా బాబులు భలే పంచేసుకుంటున్నారు.ఎవరి టైమ్ కు వారి సినిమా ఎలాంటి పోటీ లేకుండా విడుదలైపోతుంది.ఈ రిలీజింగ్లో చిన్న చిత్రాలు చితికిపోతున్నాయి.ప్రస్తుతం టాలీవుడ్లో జరుగుతోన్న పంపకాల గోలపై గట్టి చర్చే నడుస్తోంది.

టాప్ ఫ్యామిలీస్ అంతా ఒక్కో సీజన్ ఒకరిదంటూ కలరింగ్ ఇస్తున్నాయి.ద్వితీయార్ద మంతా మెగా ఫ్యామిలీదేనా అన్నట్లుగా తయారైంది.దానికి తగ్గట్లుగా మాటా మంతనాలు కూడా జరిగిపోతున్నాయి. సెకండాఫ్ మొదలయ్యేసరికి మెగా హీరోలు  మార్కెట్ ను కుమ్మేసే ప్రయత్నం చేశారు. కాని కంచె,సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో మాత్రమే వరుణ్.. మెగా ఇమేజ్ ను కాపాడాడు.చెర్రీ మాత్రం ఒప్పందంలో భాగంగా….తనకిచ్చిన టైమ్ ను యూజ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు.

ఇక నవంబర్ .డిసెంబర్ మంత్ అంతా అక్కినేని వారి పేరిట బుక్ అయిపోయింది. అఖిల్ , సోగ్గాడే చిన్ని నాయన,ఊపిరి,సాహసమే శ్వాసగా సాగిపో వంటి సినిమాలు ఈ ఏడాది చివరకు టైమ్ ఫిక్స్ చేసుకున్నాయి.

అయితే వీటిలో ఏది విజయ ఢంఖా మోగిస్తుందో చెప్పలేం గాని అక్కినేని వారికంటూ బడా బాబులు ఓ టైమ్ కేటాయించేశారు. అక్కినేని వారి తరువాత….. వచ్చే ఏడాది ప్రదమార్ధమంతా నందమూరి హీరోల హవానే సాగనుంది. బాలయ్య 99వ సినిమా డిక్టేటర్, తారక్ నాన్నకు ప్రేమతో సినిమాలు సొంగల్ కు  ప్రేక్షకులను సందడి చేయనున్నాయి. టాప్ హీరోలంతా ఇలా ఒక్కో  సీజన్ ను ఒక్కో ఫ్యామిలీకి కేటాయించేసుకోవడంతో చోటా చిత్రాలు అన్ సీజన్లో వచ్చి దెబ్బైపోతున్నాయి.లేదంటే వీరికొచ్చే సీన్ ,సినిమా  ఓ రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే బడాబాబుల చిత్రాలకు

ధీటుగా నేడు చోటా మోటా హీరోల చిత్రాలు కూడా రూపొందుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -