ప్లాప్‌లలో ఉన్నవారంత సినిమా తీస్తే ఎలా ఉంటుంది అంటే… పూరి జగన్నాథ్ , రామ్ హీరోగా తెరకెక్కిస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ లా ఉంటుందని చూపించవచ్చు. రామ్ హీరోగా తెరకెక్కతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. అయితే ఈ సినిమా సాంకేతిక వర్గం మొత్తం ప్లాప్‌లకు సంబంధించిన వ్యక్తులతో నింపేశాడు పూరి.
గత కొంతకాలంగా పూరి జగన్నాథ్‌కు సరైన హిట్ లేదు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన టెంపర్ సినిమా తరువాత ఇప్పటి వరకు సరైన హిట్ లేదు పూరికి. ఇక రామ్ విషయనికి వస్తే… రామ్ నటించిన సినిమాలు ఈమధ్య యావరేజ్‌గానే ఆడుతున్నాయి. రామ్ హిట్ కొట్టి చాలాకాలమే అయింది. చిత్ర నిర్మాత ఛార్మి…పూరి జగన్నాథ్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తుంది హీరోయిన్ ఛార్మి. పూరిజగన్నాథ్ కొడుకు ఆకాష్‌ను హీరోగా మెహాబుబా సినిమాను నిర్మించింది ఛార్మి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది. తాజాగా ఈ సినిమాలో వచ్చి చేరింది ప్లాప్ హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్.
ఈ మధ్య అనూ ఇమ్మాన్యుయేల్ నటించిన సినిమాలు అన్ని ప్లాప్‌లు అయ్యాయి. అనూ ఇమ్మాన్యుయేల్ నటించిన శైలజారెడ్డి అల్లుడు,నా పేరు సూర్య సినిమాలు ప్లాప్‌లుగా నిలిచాయి. తాజాగా తమ సినిమాలో హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యుయేల్‌ను తీసుకున్నాడు పూరీ జగన్నాథ్. ఇలా ప్లాప్‌లలో ఉన్న హీరో,హీరోయిన్,దర్శకుడు, నిర్మాత అందరు కలిసి తీస్తున్న సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
- హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపు
- ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- రైతులకు గుడ్‌న్యూస్.. ‘ఫార్మర్ ఐడీ’
- ప్రియుడితో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల!
- అమరావతికి మోదీ..5 లక్షల మందితో సభ