Monday, April 29, 2024
- Advertisement -

మోడీని తిట్టడమే వారి పని : ప్రధాని మోడీ కామెంట్స్ !

- Advertisement -

మన దేశంలోని రెండు ప్రధాన పార్టీలు అయిన బీజేపీ కాంగ్రెస్ మద్య ఎప్పుడు కూడా రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంటుంది. జాతీయ పార్టీలుగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతూన్న ఈ రెండు పార్టీల నేతలు అప్పుడప్పుడు చేసుకునే విమర్శలు తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు పార్టీల మద్య మాటల తుటాలు కోటలు దాటాయి. ఆ మద్య ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మోడీ లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీని రావణాసురుడితో పోల్చుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు..

కార్పొరేషన్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా మోడీ మొఖమే కనిపిస్తోందని, ప్రతి ఎన్నికల్లో మోడీ మొఖం చూపిస్తూ బీజేపీ ఓట్లు అడుక్కోవడం మానేయాలని హితవు పలికారు. మోడీజీ మీకేమైనా రవణాసురుడిలా 100 తలలు ఉన్నాయా అంటూ మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండి పడుతోంది. మోడీని రావణాసురుడితో పోల్చడం ప్రధానిని మాత్రమే కాదు యావత్ దేశాన్ని అవమానించడమేనని కమలనాథులు మండి పడుతున్నారు. ఇక ఖర్గే చేసిన వ్యాఖ్యలపై తాజాగా ప్రధాని మోడీ కూడా స్పందించారు. అసలు రామాయణంపైనే నమ్మకం లేని కాంగ్రెస్ నేతలు తనను రావణాసురుడితో పోల్చడం హాస్యాస్పదం అంటూ వ్యాఖ్యానించారు.

అయితే తనను రావణాసురుడితో పోల్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, కానీ ఖర్గేతో తనను తిట్టేందుకు కొందరు బలవంత పెడుతున్నారని మోడీ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేతలు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు ప్రధాని మోడీ. ఒకరేమో మోడీకి కుక్క చావు తప్పదని, మరొకరేమో మోడీ హిట్లరని, ఇంకొకరు మోడీని చంపేస్తానని.. ఇలా రకరకలుగా కాంగ్రెస్ నేతలు తనను తిడుతున్నారని మోడీ వ్యాఖ్యానించారు. ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ తనను తిట్టడమే హక్కుగా పెట్టుకున్నట్లు ఉందని అన్నారు ప్రధాని మోడీ. మొత్తానికి కాంగ్రెస్ మరియు బీజేపీ నేతల మద్య పేలుతున్న మాటల తుటాలు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

చంద్రబాబుకు బెదిరింపులా.. నో ఛాన్స్ !

ట్రైయాంగిల్ ఫైట్.. గుజరాత్ కింగ్ ఎవరు ?

లిక్కర్ క్వీన్ కవిత.. వాట్ నెక్స్ట్ కే‌సి‌ఆర్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -