Friday, May 3, 2024
- Advertisement -

నా పేరు సూర్యను భయపెడుతున్న అను ఇమ్మాన్యుయేల్…. ముంచేస్తుందా?

- Advertisement -

రంగస్థలం, భరత్ అనే నేను సినిమాల స్టైల్‌లోనే నా పేరు సూర్యతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు బన్నీ. ప్రతి సినిమా ఫలితంతోనూ హీరోల రేంజ్‌లు మారిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు నా పేరు సూర్య సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం బన్నీకి చాలా అవసరం. అసలే డిజెలాంటి సినిమాలతో బన్నీకి కాస్త తలబొప్పి కట్టి ఉంది. అయితే అన్నీ బాగున్నాయి అనుకున్న టైంలో ఇప్పుడు అను ఇమ్మాన్యుయేల్ ట్రాక్ రికార్డ్ బన్నీ అండ్ టీంకి తలనొప్పి తెప్పిస్తోందట.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది. సూపర్బ్ ఆర్టిస్ట్ అయిన జాకీ ష్రాఫ్ తెలుగులో నటించిన సినిమాలన్నీ ఫ్లాపులే. ఇక హీరోయిన్స్ కూడా చాలా మందే ఉన్నారు అలాంటి ట్రాక్ రికార్డ్‌తో. అను ఇమ్మాన్యుయేల్ రికార్డ్ కూడా వారికి ఏ మాత్రం తీసిపోదు. గోపీచంద్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన ఆక్సిజన్ సినిమాలో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌నే. ఇక ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ డిజాస్టర్‌ అని పేరు తెచ్చుకున్న అజ్ఙాతవాసిలో కూడా అను ఇమ్మాన్యుయేల్‌నే హీరోయిన్. అమ్మడి ఖాతాలో కిట్టు ఉన్నాడు జాగ్రత్త లాంటి చిన్న సైజ్ ఫ్లాప్స్‌తో పాటు తమిళ్‌లో నటించిన ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అసలు నా పేరు సూర్య హిట్ అవ్వడం బన్నీకంటే అను ఇమ్మాన్యుయేల్‌కే ఎక్కువ అవసరం. నా పేరు సూర్య కూడా అమ్మడి డిజాస్టర్ సినిమాల ఖాతాలోనో…..ఫ్లాప్ సినిమాల లిస్టులోనో చేరిందంటే మాత్రం తాను పూర్తిగా మునిగిపోవడంతో పాటు బన్నీకి కూడా స్ట్రాంగ్ దెబ్బ పడేలే చేయడం ఖాయం అన్నది క్రిటిక్స్ మాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -