- Advertisement -
నాగర్జున -రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న ఆఫీసర్ సినిమా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాగర్జున పక్కన హీరోయిన్‌గా మైరా సరీన్ నటిస్తుంది.నాగార్జున పవర్ ఫుల్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు.ఇప్పటికే ఒక యాక్షన్ టీజర్ ను వదిలారు. ఆ టీజర్ పెద్దగా ఆకట్టుకొలేదనే చెప్పాలి.వర్మ పాత సినిమాలలానే ఈ సినిమా టీజర్ కూడా ఉండటంతో…ఇప్పుడు మరో టీజర్‌ను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.
రేపు(శుక్రవారం)సినిమా రెండో టీజర్‌ను రీలిజ్ చేస్తున్నట్టు చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ఫేస్‌బుక్‌లో ప్రకటించారు.సాయంత్రం 6 గంటలకు టీజర్‌ను విడుదల చేస్తున్నారు. వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న వర్మకు ఈ సినిమా అయిన హిట్ ఇస్తుందో లేదో చూడాలి.
