Saturday, May 18, 2024
- Advertisement -

బ‌యోపిక్: మ‌ళ్లీ ప్ర‌ధాని అవుతున్న మ‌న్మోహ‌న్‌సింగ్‌..

- Advertisement -

ప‌దేళ్ల పాటు విజ‌య‌వంతంగా ప్ర‌ధాన‌మంత్రిగా దేశానికి సేవ‌.. అంత‌కుముందు ఆర్థిక‌వేత్త‌గా దేశాన్ని ప్ర‌పంచంలో కొత్త పుంత‌లు తొక్కించిన విధానం.. ఆ త‌ర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఆయ‌న చేసిన ప‌నితీరు.. త‌న‌కు ఏం ప‌ని ఇచ్చినా కిమ్మ‌న‌కుండా.. ప్ర‌శాంతంగా చేసుకుపోయే మ‌న‌స్త‌త్వం ఇవ‌న్నీ మాజీ ప్ర‌ధాన‌మంత్రి డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ సొంతం. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రిగా క‌నిపించ‌బోతున్నారు.

అయితే అది కేవలం సినిమాలోనే క‌నిపించ‌నున్నారు. ఆయ‌న జీవిత చ‌రిత్ర‌పై ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్ర‌స్తుతం భారతీయ సినిమా పరిశ్రమలో జీవిత చ‌రిత్రల సినిమాల ట్రెండ్ కొన‌సాగుతోంది. బాలీవుడ్‌లో ఈ ట్రెండ్ ఇంకా ఎక్కువ‌గా ఉంది. ప్ర‌స్తుతం ప్రేక్షకులను అలరించేందుకు ఇప్పుడు మరో బ‌యోపిక్ సిద్ధ‌మ‌వుతోంది.

‘ది యాక్సిడెంటల్ ఫ్రైమ్ మినిస్టర్’ పేరుతో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ జీవితం ఆధారంగా ఓ బయోపిక్‌ తెరకెక్కుతుంది. సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. విజయ్‌ రత్నాకర్‌ గట్టీ ద‌ర్శ‌క‌త్వంలో సీనియర్ నటుడు అనుపమ్‌ఖేర్ ప్ర‌ధాన పాత్ర‌లో సినిమా సిద్ధ‌మ‌వుతోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను అనుప‌మ్ ఖేర్ కొన్ని సినిమా ఫొటోలు పంచుకున్నారు అనుపమ్‌ఖేర్‌.

ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ పోషించడం నిజంగా సవాల్‌లాంటిందని, 24/7 మీడియా పనిచేస్తున్న కాలంలో ఆయన ప్రధానిగా ఉన్నారని, యావత్‌ ప్రపంచానికి ఆయన తెలుసని, గత కొద్ది నెలలుగా మన్మోహన్‌ పాత్రను ఆకళింపు చేసుకొంటూ…వాస్తవికతకు దగ్గరగా ఉండేలా ప్రయత్నిస్తున్నానని అనుపమ్ ట్వీట్ చేశారు.

ఈ సినిమాలో మన్మోహన్ సలహాదారుడు సంజయ్‌ బారుగా అక్షయ్‌ఖన్నా, సోనియాగాంధీగా సజ్జన్‌ బెర్నర్ట్‌ నటిస్తున్నారు. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఫ్లాన్ చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -