Wednesday, May 15, 2024
- Advertisement -

భ‌ర్త దేవుడే అయితే విడాకులు ఎందుకు?

- Advertisement -

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు మొత్తం లైంగిక వేధింపుల చూట్టునే తిరుగుతుంది. న‌టీమ‌ణులు త‌మ‌కు జరిగిన వేధింపుల గురించి బ‌హిరంగంగానే వెల్ల‌డిస్తున్నారు. దీనిలో భాగంగానే బాలీవుడ్ హీరోయిన్‌ కంగనా రనౌత్ ప్రముఖ దర్శకుడు వికాస్ బెహెల్‌పై ఆరోపణలు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే కంగనా వాఖ్య‌ల‌పై వికాస్ బెహెల్ భార్య రిచా దుబే ఘాటుగా స్పందించింది. వికాస్ మంచివాడు స్త్రీల‌ను గౌర‌విస్తాడంటూ చెప్పుకొచ్చింది.

రిచా దుబే మాట‌ల‌కు బ‌దులిస్తు… వికాస్ మంచివాడని చెబుతున్నావు కదా, దేవుడి లాంటి వ్యక్తి నుంచి నువ్వు విడాకులు ఎందుకు తీసుకున్నావో చెప్పాలని రిచా దుబేను కంగనా ప్రశ్నించారు. హృతిక్ రోషన్, సుసానే ఖాన్ విడాకులకు తానే కారణమని వేలెత్తి చూపడాన్ని కంగనా తప్పుపట్టారు. ఆ విషయాన్ని పక్కనపెడితే వికాస్ మంచి వ్యక్తే అయితే ఆయన నుంచి మీరేందుకు విడాకులు తీసుకున్నారో చెప్పాలని కంగనా డిమాండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -