Sunday, May 19, 2024
- Advertisement -

చిన్నల్లుడి కోసం రంగంలోకి మెగాస్టార్‌

- Advertisement -
  • క‌థ‌, ద‌ర్శ‌కుడి, నిర్మాత‌ ఎంపిక బాధ్య‌త అన్నీ మావ‌య్యే
  • క‌ల్యాణ్‌కు జోడిగా అనుప‌మ‌

మెగాస్టార్‌ చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్‌ను సినీరంగ ప్ర‌వేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. త‌న అల్లుడి సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. రాకేశ్‌ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. వారాహి చలన చిత్రం పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించనున్నారని టాక్‌. సాయిని ఒప్పించ‌డానికి చిరు ప్ర‌య‌త్నాలు చేశాడంట‌.

అయితే ఈ సినిమాలో కల్యాణ్‌కి జోడీగా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తోంద‌ని సమాచారం. ఈ సినిమా కోసం కల్యాణ్‌ స్క్రీన్‌ టెస్ట్‌ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో సినిమా ప్రారంభం కానుంది. కల్యాణ్‌కి సినిమాలపై ఆసక్తి ఉండడంతో విఖాప‌ట్ట‌ణంలో శిక్షణ తీసుకున్నాడ‌ట.ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ చ‌కాచ‌కా జ‌రిగిపోతున్నాయి. అన్నీ సిద్ధ‌మ‌య్యాకే ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్కింది.

చిరంజీవి ఒక్కరే సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ మధ్యనే కల్యాణ్ ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకున్నాడు. దర్శకుడు రాజమౌళిని, నిర్మాత సాయి కొర్రపాటిని కలిసి రీసెంట్ గా చర్చలు జరిపారట.

ప్ర‌స్తుతం అనుప‌మ సినిమాల‌తో బిజీగా ఉంది. ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో నానికి జోడీగా నటిస్తోంది. ఈ సినిమా పూర్త‌యిన త‌ర్వాత ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -