Sunday, May 5, 2024
- Advertisement -

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్

- Advertisement -

సాహోతో వచ్చే ఏడాది తమ హీరోని చూసేయాలని కలలు కంటోన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది నిజంగా బ్యాడ్ న్యూసే అని చెప్పాలి. ఎందుకంటే అంతా అనుకుంటున్నట్లు సాహో చిత్రం 2018 మిడ్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని తేలిపోయింది. దీనికి కారణం ఏంటో సుజిత్ అండ్ టీమ్ తమ సహచరులతో చెప్పకనే చెప్పేసింది. ఈసినిమాను తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఆయా భాషలకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి.. అది టైమ్ ప్రాసెసింగ్ పని. వందకోట్లకు పైగా ఖర్చు పెట్టి చేస్తోన్న సినిమా కావడంతో స్టాండర్డ్స్ అన్నీ చూసుకుంటున్నారు. ఏమాత్రం తేడా వచ్చిన మొత్తం డ్యామేజ్ జరుగుతుందని వారు భావిస్తున్నారు.

అందుకే యువి క్రియేషన్స్ ఈసినిమాను ఎలాగైనా సరే.. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా తీర్దిదిద్దాలని ట్రై చేస్తుంది.దానిలో భాగంగా సినిమా పూర్తయ్యే సరికి నవంబర్ నెల కావచ్చు అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని..సినిమాను ఎలాగైనా సరే… 2019లో బయటకు తేవాలని చూస్తున్నారు.బహుశ అది సంక్రాంతి కావచ్చు.లేదంటే సమ్మర్ కావచ్చు. సో ప్రభాస్ ను చూడటం కోసం జనాలు వచ్చే ఏడాది కాదు ఆ పై ఏగాది వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది.ఇది నిజంగా డార్లింగ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూసే అని చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -