Saturday, May 11, 2024
- Advertisement -

అనుష్క భాగ‌మ‌తి టీజ‌ర్ రిలీజ్‌

- Advertisement -

అనుష్క యాక్టింగ్ గురించి ప్ర‌త్యేకంగా చేప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు.హీరోల‌కి అతీతంగా త‌న‌కంటూ ఒక ఇమేజ్‌ని సంపాందిచుకుంది.అరుంధ‌తి,ర‌ద్ర‌మ‌దేవి,బాహుబ‌లి,లాంటి సినిమాలు చేసి త‌న‌లో న‌ట‌న‌కు కొద‌వ లేద‌ని నిరుపించుకుంది అనుష్క‌. బాహుబలి సీరీస్ లో దేవసేనగా అలరించిన స్వీటీ అనుష్క చేతిలో పెద్ద‌గా సినిమాలు లేవ‌నే చేప్పాలి.తన లుక్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న ఈ బ్యూటీ భాగమతి లుక్ లో ఎలా కనిపించనుందో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.త్వరలో భాగమతిగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

అనుష్క పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు(20-12-2017) భాగమతి చిత్రయూనిట్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఓ పాత కాలం బంగ్లాలోకి అనుష్క ప్రవేశించటం తరువాత తన చేతికి తానే సుత్తితో మేకు కొట్టుకోవటం లాంటి షాట్స్ తో టీజర్ ను కట్ చేశారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాటోగ్రఫి మది విజువల్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటులు ఉన్నిముకుందన్, జయరామ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

https://twitter.com/Anushka_ASF/status/943349405939306496

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -