Monday, April 29, 2024
- Advertisement -

కంటికి కనిపించే నిజాన్ని కూడా అబద్ధం అని నమ్మించడం సాధ్యమేనా పవన్, త్రివిక్రమ్?

- Advertisement -

త్రివిక్రమ్ పరిచయమవ్వక ముందు పవన్ పెద్దగా మాట్లాడింది లేదు. త్రివిక్రమ్ పరిచయమయ్యాక మాత్రం మాటల వర్షం కురిపిస్తున్నాడు. అయితే కంటికి కనిపిస్తున్న నిజాలను కూడా అబద్ధాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉండడమే దురదృష్టకరం. దేశభక్తి, నిజాయితీ, మానవత్వం …….ఇలాంటి మాటల గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. మన రాజకీయ నాయకులు ఎప్పుడో ఆ పదాలను నీచమైన రాజకీయాల కోసం వాడేశారు. ఇప్పుడు పవన్ మాత్రం ఇంకాస్త ఎమోషనల్‌గా వాడుతున్నాడు. ఎంతైనా నట రాజకీయ నాయకుడు కదా. అయితే ఆ మాటల్లోని చిత్తశుద్ధిపై అస్సలు నమ్మకం కలగకుండా చేస్తూ అబద్ధాలు చెప్తూ ఉండడమే పవన్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తోంది.

ప్రతి సారీ సినిమాలను వదిలేేస్తా, వదిలేయాలనుకున్నా అని గొప్పగా మాటలు చెప్పే పవన్ రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గడు. అలాగే తన సొంత మనుషులను ప్రొడ్యూసర్స్‌గా పెట్టి తక్కువ బడ్జెట్‌లో సినిమాలు చుట్టేసి కొట్లోది రూపాయలు వెనకేసుకున్న చరిత్ర కూడా మన తెలుగు స్టార్ హీరోలలో పవన్‌కి ఒక్కడికే ఉంది. అలాగే తనకు అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్‌కి తీవ్రస్థాయిలో నష్టం చేయాలనుకున్నాడు పవన్. ఎన్టీఆర్‌తో ఆయన తీసిన సినిమా ‘నాన్నకు ప్రేమతో’ రిలీజ్‌కి ముందు రోజు సాయంత్రం తన డబ్బులు తనకు చెల్లించకపోతే సినిమా రిలీజ్ ఆపెయ్యాలని ఫిల్మ్ ఛాంబర్‌కి లేఖ రాసిన ఘనడు పవన్. ఏ ఇతర తెలుగు స్టార్ హీరో కూడా కేవలం డబ్బుల కోసం తోటి స్టార్ హీరో సినిమా రిలీజ్ రోజు ఇలా ఎప్పుడైనా చేశారా? ఆత్మహత్యే శరణ్యమన్న సర్దార్ గబ్బర్ సింగ్ డిస్ట్రిబ్యూటర్స్ నిరాహారదీక్షకు దిగితే పవన్ చుట్టూ ఉన్న మాఫియా వాళ్ళను బెదిరించిన మాట నిజంకాదా? ఆ విషయాన్ని సర్దార్ గబ్బర్‌సింగ్ డిస్ట్రిబ్యూటర్సే భయం భయంగా చెప్పారు. మరి ఆ సినిమాకు 30కోట్ల పైనే వెనకేసుకున్న పవన్ నష్టపోయిన వాళ్ళను ఆదుకున్నాడా? ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన తన ఫ్రెండ్ శరత్ మరార్‌కి చెప్పాడా ఆదుకోమని? సినిమా కొని నష్టపోతే పవన్‌కి ఆదుకోవాల్సిన బాధ్యత ఉందా? అంటే లేదనే చెప్పాలి. కానీ చేతల్లోనే తన సినిమా కొని నష్టపోయిన వాళ్ళను బెదిరించడం………మాటల్లో మాత్రం నాకు డబ్బంటే ఇష్టం లేదు, నా వళ్ళ నష్టపోతే తిరిగిచ్చేస్తూ ఉంటా అని, జానీ సినిమాకు అందరికీ తిరిగి ఇచ్చాడని ప్రచారం చేయించుకుంటూ ఉంటేనే చిరాగ్గా ఉంటుంది.

అజ్ఙాత వాసి ఆడియో రిలీజ్ కార్యక్రమంలో త్రివిక్రమ్ ఒక పెద్ద అబద్ధం చెప్పాడు. పవన్ సినిమా కెరీర్‌లో మాత్రం నేను ఉన్నాను. పొలిటికల్ కెరీర్‌కి నాకు సంబంధం లేదు అన్నట్టుగా చెప్పాడు. అయితే అది చాలా పెద్ద అబద్ధం. జనసేన పార్టీ టైటిల్ సాంగ్ రాయించింది త్రివిక్రమ్ శ్రీనివాస్‌నే. ఆ విషయాన్ని ఆ పాట రాసిన రచయితలు టివి9 ఛానల్ స్టూడియోలో కూర్చుని మరీ చెప్పారు. ఇక రీసెంట్‌గా ఛలోరే ఛల్ సాంగ్‌లో ముందు మాటలు త్రివిక్రమ్‌వి వినిపిస్తాయి. అది రాజకీయ గీతం అని త్రివిక్రమ్‌కి తెలియదా. ఇక పవన్ స్పీచ్‌లు, పవన్ రాజకీయ వ్యూహాల వెనుక త్రివిక్రమ్ ఉన్నాడన్న విషయాన్ని పవన్ సన్నిహితులే చెప్తూ ఉంటారు. త్రివిక్రమ్ మాట్లాడిన తర్వాత అదే అజ్ఙాత వాసి ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లోనే పవన్ మాట్లాడిన మాటల్లో పవన్ రాజకీయ జీవితంలో త్రివిక్రమ్ సలహాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పకనే చెప్పాడు.
అయినా త్రివిక్రమ్, పవన్‌లు ఇద్దరూ కూడా నిజాయితీ, మానవత్వం అంటూ గొప్ప గొప్ప రచయితలు రాసిన మాటలను వల్లెవేస్తూ ఉంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -