Thursday, May 9, 2024
- Advertisement -

ఏంది వరుణ్ తేజూ? సినిమాలో సరుకు లేదా? ‘తొలిప్రేమ’ అని క్లాసిక్ టైటిల్ పెట్టి ఇంత ఛీప్ టీజర్ వదుల్తారా?

- Advertisement -

పవన్ కళ్యాణ్ పవర్ స్టార్‌గా మారడానికి పడిన తొలి బ్లాక్ బస్టర్ అడుగు తొలిప్రేమ. క్లాసిక్ హిట్. అలాంటి సినిమా టైటిల్‌తో సినిమా వస్తుందంటే ఆ టీజర్ ఎలా ఉండాలి? ఏ స్థాయి కంటెంట్‌ ఉంటే ఆ ‘తొలిప్రేమ’ టైటిల్‌కి జస్టిస్ చేయగలరు? ఆ స్థాయి కంటెంట్ లేకపోతే కేవలం బిజినెస్ క్రేజ్ కోసం, ఓపెనింగ్ కలెక్షన్స్ కోసం ‘తొలిప్రేమ’ టైటిల్‌ని క్యాష్ చేసుకోవడానికి మాత్రమే టైటిల్‌ని వాడుకుంటున్నారని అనుమానపడరా? పవన్ క్రేజ్ కూడా సినిమాలో విషయం ఉంటేనే హెల్ప్ అవుతుందన్న విషయం మరిచారా? తొలిప్రేమ టీజర్ చూస్తే ఈ అనుమానాలే వస్తున్నాయి.

తొలిప్రేమ టీజర్‌కి పవన్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది సినిమా టీజర్ ఇన్‌స్పిరేషనేమో అనిపిస్తోంది. ఆ టీజర్‌లో కూడా పవన్ నడుచుకుంటూ కనిపిస్తాడు . టజర్ అయిపోతుంది. అయితే ఎట్‌లీస్ట్ పవన్ ఎంత ధనవంతుడో? అతని హంగామా ఏ స్థాయిలో ఉంటుందో అన్న విషయం అయినా టీజర్‌లో కాస్త అర్థమవుతుంది. కానీ వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ టీజర్‌లో మాత్రం అస్సలు ఏమీ అర్థం కాదు. అసలా టీజర్‌లో ఏమైనా ఉంటే కదా ……అర్థమవ్వడానికి. వరుణ్ తీజ్ అటూ ఇటూ నడుస్తాడు అంతే. అది కూడా బ్యాక్ గ్రౌండ్‌లో ‘ఎన్ని ప్రేమలున్నా ఫస్ట్ లవ్ ప్రత్యేకం’ అని చెప్తూ ఒక అరిగిపోయిన డైలాగ్ వనిిపిస్తుంది. ఇక వరుణ్ ఎక్స్‌ప్రెషన్స్‌లో, లుక్స్‌లో పొయెటిక్ స్టైల్‌లో ఒక లవర్ బాయ్‌ని చూపించాలనుకున్నారు కానీ వరుణ్‌కి ఇంకా ఆ స్థాయి యాక్టింగ్ స్కిల్స్ రాలేదు. అందుకే ఫ్లాట్‌గా చూసుకుంటూ …….మామూలుగా తన రెగ్యులర్ స్టైల్‌లోనే నడిచాడు. అయినా కంటెంట్ ఏంటి అనే విషయం వరుణ్‌కి స్పష్టంగా చెప్పి ఉంటే బాగుండేదేమో. అలా కాకుండా అటూ ఇటూ నడువు అని చెప్పినట్టున్నారు. వరుణ్ కళ్ళలో ఎక్కడా కూడా ‘తొలిప్రేమ’ టైటిల్‌కి జస్టిఫికేషన్ ఇచ్చే స్థాయిలో లుక్స్ అయితే అస్సలు కనిపించలేదు. కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విషయం లేక క్రేజ్ కోసం ‘తొలిప్రేమ’ అన్న టైటిల్ పెట్టారో……లేక ‘తొలిప్రేమ’ స్థాయి ప్రేమకథ ఉందో అన్న విషయం తెలియాలంటే ట్రైలర్ వరకూ ఆగాలేమో. ట్రైలర్ కూడా టీజర్‌లాగే విషయం లేకుండా ఉంటే మాత్రం సినిమా ఫలితం తారుమారు అవడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -