Monday, May 20, 2024
- Advertisement -

ఈ హీరోయిన్లు ఎవరితోడూ లేకుండా ఇంట్లో ఒంటరిగా..!

- Advertisement -

ఆ మధ్య శ్రుతిహాసన్ ఈ విషయాన్ని ప్రకటించుకొంది. అందరినీ ఆశ్చర్యపరిచింది! ఇప్పుడు ఆమెకు తోడుగా పరిణితీ  చోప్రా జాయిన్ అయ్యింది. ఈమె కూడా  అచ్చం శ్రుతిలాగే! అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

తను కొత్తగా కొన్నా ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటానని ప్రకటించింది పరిణితీ చోప్రా. ఇన్ని సంవత్సరాల పాటూ అద్దె ఇంట్లో ఉన్న తను ఇప్పుడు సొంతంగా ఇళ్లు కొన్నానని.. ఇప్పుడు అందులో ఒంటరిగా ఉంటానని ఆమె వివరించింది. ముంబాయిలోనే ఖరీదైన ప్రాంతంగా పేరున్న బాంద్రాల ఏరియాలో ఈ హీరోయిన్ ఇళ్లు కొనుక్కొంది. ఆ ఇంట్లో కుటుంబ సభ్యులెవరూ ఉండరని.. తను మాత్రమే ఉంటానని ఆమె చెబుతోంది.

మరి శ్రుతి హాసన్ అయినా.. పరిణితీ అయినా ఈ వయసులో లోన్లీగా ఉండటం ఆశ్చర్యకరమైన విషయం. బీభత్సమైన క్రేజ్..  ప్రేమిస్తామని మేల్ సెలబ్రిటీలు వెంట పడే దశలో ఉన్న వారు… ఒంటరిగా ఉండటం విచిత్రమే కదా! పరిణితీ పేరు ఎప్పుడు ప్రేమాయణాల్లో వినిపించలేదు కానీ.. శ్రుతికి మాత్రం వెనుకటికే డేటింగ్ చరిత్ర ఉంది. అలాంటి దాన్ని పక్కనపెట్టి లోన్లీగా ఉండటం గొప్ప కథే కదా! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -