Thursday, May 2, 2024
- Advertisement -

ఆ పెళ్లికి అనుష్కతో కలిసే వెళ్లనున్న విరాట్!

- Advertisement -

ప్రపంచకప్ సెమిస్ లో కనీసం పోరాటపటిమను చూపకుండా వెనుదిరిగారని అపవాదును ఎదుర్కొంటున్న భారత క్రికెటర్లకు ఇప్పుడు పెళ్లి సందడి వచ్చింది.

వీరంతా తమ సహచరుడు సురేష్ రైనా పెళ్లి సందడిలో భాగస్వాములవుతున్నారు. ప్రపంచకప్ ఆరంభానికి ముందే ప్రకటించినట్టుగా రైనా పెళ్లి జరగబోతోంది. ప్రపంచకప్ లో  తన ప్రదర్శనతో పర్వాలేదనిపించిన రైనా ఇప్పుడు పెళ్లి కొడుకవుతున్నాడు. అయితే ప్రపంచకప్ ను ముగించుకొని ఇటీవలే ఇండియాకు వచ్చిన రైనా కప్ కు, పెళ్లికీ పెద్ద గ్యాప్ లేకపోవడంతో ఇబ్బంది అయ్యిందని అంటున్నాడు! పెళ్లి పనులన్నింటినీ చేసుకోలేకపోతున్నానని.. షాపింగ్ కు కూడా సమయం చాలడం లేదని రైనా వ్యాఖ్యానించాడు. ఇక జట్టులోని ఇతర సహచరులు ఒక్కొక్కరుగా వివాహ వేదిక అయిన ఢిల్లీకి చేరుకొంటున్నారు. కెప్టెన్ ధోనీతో సహా అనేక మంది తమ కుటుంబాలతో రైనా వివాహానికి హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. రైనా యూపీకి చెందిన క్రికెటర్. దీంతో అనేక మంది రాజకీయ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. సినిమా వాళ్లు హాజరీకి కూడా లోటు ఉండకపోవచ్చు. టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కొహ్లీ ఈ వివాహ వేడుకకు తన గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మతోకలిసి హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.  మొత్తానికి మొన్నటి వరకూ టీమిండియాలో  ఉన్న బ్రహ్మచారుల్లో ఒకడిగా ఉన్న రైనా ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -