Saturday, May 18, 2024
- Advertisement -

రాహల్.. ఓ తప్పిపోయిన విమానం!

- Advertisement -

ఒకవైపు భారతీయజనతా పార్టీ ప్రభుత్వంపై పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ తాపత్రయపడుతోంది. మోడీ సర్కారు గద్దెనెక్కి దాదాపు ఏడాది పూర్తి కావొస్తున్న తరుణంలో ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేయడం ద్వారా తమ ఉనికిని చాటుకోవాలని..

. ఆ పార్టీ నేతలు అనుకొంటున్నారు. లోక్ సభలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితి నుంచి వచ్చే ఎన్నికల సమయానికి అయినా కొంత బెటర్ మెంట్ కావాలంటే.. ఇప్పటి నుంచే పోరాడాలని వారు భావిస్తున్నారు.

అయితే కాంగ్రెస్ కు ఇప్పుడు సరైన రౌతు లేకుండా పోయాడు. ఇంత వరకూ భారత రాజకీయ చరిత్రలో ఏ పొలిటీషీయనూ వెళ్లని రీతిలో రాహుల్ సెలవు మీదు వెళ్లాడు. మరి ఎక్కడికి వెళ్లాడు.. ఏం చేస్తున్నాడు.. అనే విషయాలు రహస్యాలుగా మిగిలిపోవడంతో ఇవి భారతీయ జనతా పార్టీ ప్లస్ పాయింట్లవుతున్నాయి. బీజేపీ నేతలు తమకు తోచినట్టుగా రాహుల్ పై సెటైర్లు వేస్తున్నారు.

సోనియాగాంధీ రంగు మీద వివాదాస్పద వ్యాఖ్యానాలు చేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తాజాగారాహుల్ ను లక్ష్యంగా చేసుకొన్నాడు. రాహుల్ గాంధీ ఆచూకీ తెలియకపోవడంపై స్పందిస్తూ.. ఆయన ఒక తప్పిపోయిన విమానం లాంటి వాడని గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు! ఇది రాహుల్ పై గట్టి సెటైరే.. అయితే కమలనాథులకు ఇప్పుడు కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. రాహుల్ సరిగా ఉండుంటే.. బీజేపీకిగట్టి సమాధానం చెప్పే అవకాశం ఉండేది. అయితే ఆయనే సరిగా వ్యవహరించపోవడంతోనే కదా కాంగ్రెస్ కు ఈ కష్టాలన్నీ!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -