Monday, May 6, 2024
- Advertisement -

తెలంగాణలో ఇదేం సంస్కృతి..?!

- Advertisement -

తెలంగాణ ఉద్యమంలో భాగంగా అలవాటు అయిన విగ్రహాలు ధ్వంసం చేసే సంస్కృతి ఇక్కడ ఇంకా వదిలినట్టుగా లేదు. అప్పట్లో రాష్ట్ర విభజన ఆకాంక్షను తెలపడానికి..

ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను వివరించడానికి పెద్ద ఎత్తున విగ్రహాల విధ్వంసానికి పాల్పడ్డారు. ట్యాంక్ బండ్ పై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేశారు. అదంటే ఏదో ఉద్యమ వేడి అనుకొని సర్దుకుపోయినా.. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష సిద్ధించిన తర్వాత కూడా అలాంటి పనులు జరుగుతుండటం విశేషం. ఇప్పటి వరకూ శ్రీకాంతాచారి, చాకలి ఐలమ్మ విగ్రహాలు మాత్రమే ధ్వంసం అయ్యాయని అనుకొంటే.. ఇప్పుడు దుద్ధిళ్ల శ్రీపాదరావు విగ్రహం ధ్వంసం అయ్యింది. మాజీ స్పీకర్ అయిన దుద్ధిళ్ల శ్రీపాద రావు విగ్రహాన్ని కరీంనగర్ జిల్లా బస్వాపూర్ లో ధ్వంసం చేశారు. ఇప్పటికే ఒకసారి ఈ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేయగా.. పునర్నర్మించారు. ఇప్పుడు మళ్లీ దాన్ని అగంతకులు పగుల గొట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పచేసిన దుద్ధిళ్ల శ్రీధర్ రావు శ్రీపాదరావు తనయుడే. శ్రీపాదరావు వెనుకటికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. నక్సలైట్ల చేతిలో హత్యకు గురయ్యారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -