Saturday, May 18, 2024
- Advertisement -

అనుష్క‌నిగుర్తు ప‌ట్ట‌డం క‌ష్ట‌మే..మ‌రి కోహ్లి సంగ‌తి

- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్ర‌యోగాల‌కు పెద్ద పీట వేస్తుంది. మొన్న ఆ మ‌ధ్య వచ్చిన ప‌రీ సినిమాతో ఆమె అభిమానుల నుంచే కాక సినీ విమ‌ర్శ‌కుల నుండి కూడా అనుష్క న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి.ఈ సినిమాలో అనుష్క శ‌ర్మ దెయ్యంగా కనిపించి బ‌య‌పెట్టింది.ఇప్పుడు అనుష్క శర్మ మ‌రో ప్ర‌యోగాత్మ‌క సినిమాకు రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె వరుణ్‌ ధావన్‌తో కలిసి ‘సుయీ ధాగా’సినిమాలో నటిస్తున్నారు. భరత్‌ కఠారియా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా 2018 సెప్టెంబర్‌లో విడుదలకానుంది.

కాగా, అనుష్క వృద్ధురాలిగా కనిపించే తాజా లుక్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మేకప్ కు టచప్స్ వేస్తున్న సమయంలో తీసిన ఫోటో ఒకటి నెట్ లో వైరల్ అవుతోంది. వృద్ధురాలి పాత్రలో ఆమె చూపించబోయే నటనే ఈ చిత్రానికి అసలు సిసలైన హైలైట్ అని తెలుస్తోంది. ఒకవైపు ఐపీఎల్‌ మ్యాచ్‌లకు హాజరవుతూ భర్త విరాట్‌ కోహ్లిని ఎంకరేజ్‌ చేస్తోన్న అనుష్క శర్మ మరోవైపు షూటింగ్స్‌ను కూడా చక్కగా మేనేజ్‌ చేసుకుంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -