Friday, May 17, 2024
- Advertisement -

మరోసారి తండ్రి కాబోతున్న షాహిద్‌

- Advertisement -

బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్ మ‌రోసారి తండ్రి కాబోతున్నాడు.అవును ఈ విష‌యాన్ని స్వ‌యంగా షాహిదే త‌న ట్వీట్ట‌ర్‌లో తెలిపాడు.బాలీవుడ్‌లో హీరోలు , హీరోయిన్ల‌కు ఎంత క్రేజ్ ఉంటుందో వారి పిల్లలు కూడా అదే క్రేజ్ ఉంటుంది.దీనికి సాక్ష్యమే సైఫ్ అలీ ఖాన్ కొడుకు తైమూర్‌.ఇత‌నికి సోష‌ల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.షాహిద్ క‌పూర్ 2015లో ఢిల్లీకి చెందిన మీరా రాజ్‌పుత్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. 2016లో షాహిద్‌- మీరాలు మిషాకు జన్మనిచ్చారు.

మీరా రాజ్‌పుత్‌ ప్రెగ్నెంట్‌ అంటూ బీ టౌన్‌లో వదంతులు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఫొటో షేర్‌ చేయడం ద్వారా షాహిద్‌ కన్ఫర్మేషన్‌ ఇచ్చేశాడు.షాహిద్‌- మీరా రాజ్‌పుత్‌ల ముద్దుల తనయ మిషా పక్కన బిగ్‌ సిస్టర్‌ అనే అక్షరాలు, బెలూన్‌లతో కూడిన ఫొటో శుభవార్తకు సంబంధించిందేనని అభిమానులు సంబరపడిపోతున్నారు.షాహిద్ క‌పూర్ మొద‌ట బాలీవుడ్ హీరోయిన్ క‌రీనా కపూర్‌ని ప్రేమించాడు. వీరిద్ద‌రి క‌లిసి కొన్ని సినిమాలు కూడా చేశారు. త‌రువాత కాలంలో విడిపోయి వేరు వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు.

https://www.instagram.com/p/BhzBaBjFqRo/?taken-by=shahidkapoor

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -