Thursday, May 9, 2024
- Advertisement -

భయపెట్టి షాక్ ఇచ్చిన భాగమతి………టీజర్ బాగుంది……అనుష్కకి మరో అరుంథతి ఖాయమా?

- Advertisement -

చాలా మంది తెలుగు హీరోలకంటే కూడా చాలా చాలా వెరైటీ జోనర్ సినిమాల్లో యాక్ట్ చేసింది అనుష్క. అలాంటి అదృష్టం నటులు అందిరికీ రాదు. సూపర్, బిల్లా లాంటి సినిమాల్లో గ్లామరస్ హీరోయిన్‌గా, అరుంథతి అద్భుతంగా అభినయించగల నటిగా ….అలాగే రుద్రమదేవి లాంటి సినిమాల్లో తన రాజసాన్ని అద్భుతంగా చూపించింది అనుష్క. ఇక బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ, ప్రభాస్, రానాలకు ధీటుగా నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో ఏ ఇతర హీరోయిన్‌కి ఇలాంటి ఫీట్ సాధ్యం కాలేదు. హీరోలకు కూడా ఇన్ని ప్రత్యేక పాత్రల్లో నటించే అదృష్టం దక్కలేదు.

ఇప్పుడు మరోసారి భాగమతి అనే వైవిధ్యం ఉన్న హిస్టారికల్ సినిమాతో వస్తోంది అనుష్క. అయితే ఇప్పటి వరకూ ‘భాగమతి’ కేవలం హిస్టారికల్ సినిమా అనే అనుకున్నారు. కానీ ఈ రోజు రిలీజ్ అయిన టీజర్‌తో ఈ సినిమా హారర్ జోనర్‌లో తెరకెక్కుతున్న హిస్టారికల్ సినిమానా అన్న అనుమానాలు వస్తున్నాయి. అదే నిజమైతే మాత్రం ఈ సినిమా ఒక సరికొత్త జానర్ క్రియేట్ చేయడం ఖాయం. ఇప్పటి వరకూ వచ్చిన హిస్టారికల్ చిత్రాలేవీ కూడా హారర్ జోనర్‌లో తెరకెక్కలేదు మరి. తెలుగు వరకూ అయితే మాత్రం ఇది పూర్తిగా సరికొత్త ప్రయత్నం.

పిల్ల జమీందర్ లాంటి మంచి సినిమాను అందించిన అశోక్ ఈ సినిమా దర్శకుడు. టీజర్‌లో అయితే మాత్రం డైరెక్టర్ ప్రతిభ కనిపించింది. విజువల్స్ క్వాలిటీ గ్రాండియర్‌గా ఉంది. వరుస హిట్స్ కొడుతున్న ప్రభాస్ ఫ్రెండ్స్ బ్యానర్ యూవీ క్రియేషన్స్‌ మరో హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక టీజర్‌లో అనుష్క కనిపించిన విధానం కూడా చాలా బాగుంది. ఒక సరికొత్త అనుష్కను చూడడం అయితే ఖాయమని చెప్పొచ్చు. అరుంధతి సినిమాతో అప్పటి వరకూ స్టార్ హీరోలు సాధించిన కలెక్షన్స్‌ని బీట్ చేసి సంచలనం సృష్టించిన అనుష్క…….ఈ భాగమతితో మరోసారి అలాంటి ఫీట్ సాధిస్తుందేమో చూడాలి. అదే జరిగితే మాత్రం తెలుగులో వరుసగా సరికొత్త ప్రయత్నాలు మొదలవడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -