Friday, May 17, 2024
- Advertisement -

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అనుష్క

- Advertisement -

హీరోయిన్ అనుష్క పెళ్లి ఇప్ప‌టికే చాలానే రూమ‌ర్లు వ‌చ్చాయి.వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు ఖండిస్తునే వ‌స్తుంది అనుష్క‌.గ‌తంలో హీరో ప్ర‌భాస్‌ను అనుష్క పెళ్లి చేసుకోబోతుంద‌ని ,గుజ‌రాత్‌కు చెందిన వ్యాపారస్థుడు కొడుకుని పెళ్లి చేసుకుంటుంద‌ని గతంలో చాల‌నే వార్తలు వ‌చ్చాయి.అవి అన్ని ఊట్టి వార్త‌లే అని అనుష్క తెల్చేశారు.తాజాగా అనుష్క పెళ్లి చేసుకుంటుంద‌ని మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.దీనికి కార‌ణం అనుష్క త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటోనే కార‌ణం.కాలికి మెట్టెలుగా ఆకులను పెట్టుకున్న ఫోటోని పోస్ట్ చేసిన అనుష్క.. దీనికి క్యాప్షన్ అవసరం లేదు.. అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో అభిమానులంతా పెళ్లి చేసుకోబోతున్నారా..? అంటూ అనుష్కని ప్రశ్నిస్తున్నారు.

అయితే త‌న పెళ్లిపై వ‌స్తున్న రూమ‌ర్ల‌కు క్లారిటీ ఇచ్చింది అనుష్క‌.అయితే ఈ ఫోటోకి తన పెళ్లికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది అనుష్క. అసలు విషయంలోకి వస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ తన శరీర బరువు తగ్గించుకోవడం కోసం నార్వేలోని ఓ ప్రకృతి వైద్యశాలలో చేరింది. ఇక్కడ నాచురోపతి ట్రీట్మెంట్ ద్వారా బరువు తగ్గిస్తారు.దట్టమైన అడవుల్లో ఉండే ఈ వైద్యశాలలో ఖాళీ సమయాల్లో సరదాగా తిరుగుతూ ఉండగా.. ఆమె కాలికి తగిలిన తీగను ఫోటో తీసి పోస్ట్ చేసిందట. ఈ ఫోటో చూసి అభిమానులు అనుష్క పెళ్లి చేసుకోబోతుంద‌ని ఊహించుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -